జనసేనలో చేరిక... ఊహాగాణాలకు క్లారిటీ ఇచ్చిన మనోజ్ కామెంట్స్!!
ఈ నేపథ్యంలోనే... జనసేన పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరుగుతుందనే ప్రశ్నకు సమాధానంగా స్పందించిన..." నో కామెంట్స్ అండీ... థాంక్యూ" అని ముగించారు మనోజ్!
By: Tupaki Desk | 16 Dec 2024 4:50 PM GMTసుమారు గత వారం రోజులుగా మంచు ఫ్యామిలీలో మంటలు అనే వ్యవహారం అటు మీడియాలోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. మనోజ్ దంపతులు జనసేనలో చేరుతున్నట్లు కథనాలొచ్చాయి.
సోమవారం ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనడానికి మంచు మనోజ్ - మౌనిక దంపతులు వెళ్తున్నారని.. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న భూమా ఫ్యామిలీ అభిమానులు, కార్యకర్తలకు ఆహ్వానం అందించారని.. ఈ వేడుకలోనే తమ రాజకీయ రంగప్రవేశంపై మనోజ్ దంపతులు క్లారిటీ ఇస్తారని ప్రచారం జరిగింది.
ఇందులో భాగంగా... మనోజ్ - మౌనికల పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని.. ఈ క్రమంలోనే... వీరి పొలిటికల్ ఎంట్రీ ఆళ్లగడ్డ కేంద్రంగానే జరగబోతుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమ రాజకీయ ఎంట్రీపై అభిమానులతో చర్చించనున్నారని ప్రచారం జరిగింది.
అవును... మనోజ్ - మౌనిక దంపతులు పొలిటికల్ ఎంట్రీ అంటూ జరుగుతున్న ప్రచారం ఆసక్తిగా కొనసాగుతున్న వేళ.. మంచు మనోజ్ స్పందించారు. సోమవారం ఆళ్లగడ్డ వచ్చిన ఆయన దీనిపై స్పష్టత ఇచ్చారు. దీంతో.. పొలిటికల్ ఎంట్రీ ప్రచారానికి మరింత బలం చేకూర్చారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా స్పందించిన మనోజ్... ఈ రోజు తన అత్తగారి జయంతి అని.. అందుకోసమే మొదటిసారిగా తమ కూతురు దేవసేన శోభను ఆళ్లగడ్డకు తీసుకొచ్చామని.. ఈ రోజు తీసుకొద్దామనే ఇన్నాళ్లూ ఇక్కడకు తీసుకురాలేదని తెలిపారు. ఇదే సమయంలో.. తమ కుటుంబం, స్నేహితులు, సోదరులతో కలిసి ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు.
ఊరిలో అంతా తమను ఆహ్వానించి ఎంతో ప్రేమగా చూసుకున్నారని.. ఈ సందర్భంగా ఇక్కడున్న ప్రజలకు, భూమా కుటుంబానికి, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ థాంక్యూ అని అన్నారు. ఈ సందర్భంగా రాయలసీమలోని ప్రతీ ప్రాంతం నుంచి వచ్చిన తన అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే... జనసేన పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరుగుతుందనే ప్రశ్నకు సమాధానంగా స్పందించిన..." నో కామెంట్స్ అండీ... థాంక్యూ" అని ముగించారు మనోజ్!
అలాంటిది ఏమీ లేదు.. ప్రస్తుతానికి పొలిటికల్ ఎంట్రీ ఆలోచన లేదు.. అదంతా కేవలం ప్రచారం మాత్రమే, వాస్తవం లేదు.. అన్నట్లు కాకుండా... "నో కామెంట్" అంటూ స్పందించడంపై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైందని అంటున్నారు. దీంతో... జనసేనలో చేరికపై ఇంకా సస్పెన్స్ లైవ్ లో ఉంచినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు.