నారా లోకేష్‌తో మంచు మనోజ్ భేటీ.. కారణం అదేనా..?
మంత్రి నారా లోకేష్‌తో సినీనటుడు మంచు మనోజ్ దంపతులు భేటీ అయ్యారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. వీరి భేటీపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 15 Jan 2025 10:35 AM GMTఏపీ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నారావారిపల్లెలలో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి నారా లోకేష్‌తో సినీనటుడు మంచు మనోజ్ దంపతులు భేటీ అయ్యారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. వీరి భేటీపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మంత్రి లోకేష్‌తో భేటీ అయిన మనోజ్ తన ఫ్యామిలీ సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. మోహన్ బాబు యూనివర్సిటీకి మనోజ్ రావద్దంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దాంతో వీరి మధ్య జరిగిన చర్చపై మరింత ఆసక్తికర కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలు చర్చకు దారితీశాయి. నిన్న నారావారిపల్లె నుంచి మోహన్ బాబు కాలేజీ వరకు మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఓ వైపు మనోజ్ పోస్టర్లు, మరో వైపు విష్ణు పోస్టర్లు కనిపించాయి. అయితే.. రాత్రికిరాత్రే మనోజ్‌కు సంబంధించిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. మరోవైపు.. మోహన్ బాబు కాలేజీకి మనోజ్ వస్తారన్న సమాచారంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం మోహన్ బాబు, మిగితా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారు. కోర్టులో కేసు ఉన్న కారణంగా కాలేజీ ప్రాంగణంలోకి మనోజ్‌కు అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు మనోజ్‌కు సూచించారు. దీంతో మనోజ్ కాలేజీకి వెళ్లకుండా నారావారిపల్లెకు వెళ్లారు. లోకేష్‌తో భేటీ అనంతరం తిరిగి రంగంపేటలో జల్లికట్టు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు.
ఇదిలా ఉండగా.. మంచు మనోజ్ కాలేజీలోకి రావద్దంటూ మోహన్ బాబు ఇప్పటికే కోర్టులో ఇంజెక్షన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు పరిగణలోకి తీసుకొని అనుమతినిచ్చింది. దీంతో మనోజ్ కాలేజీ వద్దకు వెళ్లిన సమయంలో అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. కాలేజీకి ఉన్న నాలుగు గేట్ల వద్దకు మనోజ్ వెళ్లినప్పటికీ పోలీసులు అంతటా ఆపారు. మనోజ్‌తోపాటు ఆయన భార్య మౌనిక కూడా కాలేజీ వద్దకు వెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో చివరకు నారావారిపల్లెకు వెళ్లి లోకేష్‌తో భేటీ అయ్యారు. అక్కడ వారు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు సమాచారం.