Begin typing your search above and press return to search.

మోహన్ బాబు – మనోజ్ ఎపిసోడ్ లో కీలక పరిణామం!

అయితే.. అదంతా అసత్య ప్రచారం అంటూ విష్ణు పీఆర్వో టీమ్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   9 Dec 2024 3:18 PM GMT
మోహన్ బాబు – మనోజ్ ఎపిసోడ్ లో కీలక పరిణామం!
X

మంచు ఫ్యామిలీలో వివాదం ఏర్పడిందని.. ఆస్తి పంపకాల విషయంలో మంచు మోహన్ బాబు - మనోజ్ మధ్య గొడవ జరిగిందంటూ ఆదివారం ఉదయం నుంచి మీడియాలో కథనాలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. అదంతా అసత్య ప్రచారం అంటూ విష్ణు పీఆర్వో టీమ్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ లు పరస్పరం ఒకరిపై ఒకరు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పడం.. ఇండస్ట్రీలోనూ, మీడియాలోనూ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయాలని ఇరువురికీ పోలీసులు సూచించినట్లు చెబుతున్నారు! ఈ క్రమంలో మనోజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.

అవును... మంచు మనోజ్ తన నివాసం నుంచి బయలుదేరి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తనపై దాడి.. తన తండ్రి మోహన్ బాబు ప్రమేయంతోనే జరిగిందని చెబుతూ.. దాడి చేసిన వారి పేర్లు పొందుపరుస్తూ ఫిర్యాదు చేసినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది.

కాగా... మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవ జరిగిందని.. ఈ గొడవలో మనోజ్ గాయపడ్డారని ఆదివారం ఉదయం నుంచి తీవ్ర ప్రచారం జరగగా... అదే రోజు సాయంత్రం మనోజ్ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. ఆ సమయంలో ఆయన నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లు కనిపించారు. అయితే... ఆ గాయం ఎలా జరిగిందో చెప్పలేదు!

అయితే.. సోమవారం ఉదయం దీనికి సంబంధించిన మెడికో లీగల్ రిపోర్ట్ తెరపైకి వచ్చిందని.. ఇందులో భాగంగా... మనోజ్ కు కడుపు, వెన్నెముక, ఎడమ కాలి పిక్క భాగంలో దెబ్బలు తగిలాయని.. మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లు ఉన్నాయని తేలిందని అంటున్నారు! దీంతో... ఆదివారం నుంచి జరుగుతున్న ప్రచారానికి ఇదంతా కొనసాగింపనే చర్చ మొదలైందని అంటున్నారు.

ఇక... మోహన్ బాబు, మంచు మనోజ్ లు పరస్పరం ఒకరిపై ఒకరు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారని.. స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయాలని ఇరువురుకీ పోలీసులు సూచించినట్లు చెబుతున్న వేళ... సోమవారం రాత్రి మంచు మనోజ్ కి సంబంధించినట్లు చెబుతున్న వాహనం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ వద్ద కనిపించిందనే విషయం ఆసక్తిగా మారింది!