Begin typing your search above and press return to search.

సంచలన నిర్ణయం దిశగా మనోజ్ దంపతుల!.. ఆ పార్టీలోకే ఎందుకంటే..?

ప్రస్తుతం మనోజ్ ఇటు సినిమాల్లోనూ, మౌనిక అటు వ్యాపారంలోనూ బిజీగా ఉన్నారని అంటున్న వేళ.. తాజాగా ఫ్యామిలీలో జరిగిన వారిలో సరికొత్త ఆలోచన రేకెత్తించిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 Dec 2024 7:20 AM GMT
సంచలన నిర్ణయం దిశగా మనోజ్  దంపతుల!.. ఆ పార్టీలోకే ఎందుకంటే..?
X

గత వారం రోజులుగా మంచు ఫ్యామిలీ వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దాడులు, కేసులు, ఆస్పత్రిలో చేరికలు, పోలీసుల విచారణలు, క్షమాపణలు, జనరేటర్ లో పంచదారలు... ఒకటా రెండో.. ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో అన్నట్లుగా తీవ్ర సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

మంచు ఫ్యామిలీ వ్యవహారం రచ్చగా మారడం.. ఈ విషయంలో మంచు మనోజ్ పై అటు మీడియాలోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ సానుభూతి పవనాలు వీచాయనే చర్చ జరగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. మంచు మనోజ్ - మౌనిక దంపతులు జనసేన పార్టీలో చేరబోతున్నారని అంటున్నారు.

అవును... ప్రస్తుతం మనోజ్ ఇటు సినిమాల్లోనూ, మౌనిక అటు వ్యాపారంలోనూ బిజీగా ఉన్నారని అంటున్న వేళ.. తాజాగా ఫ్యామిలీలో జరిగిన వారిలో సరికొత్త ఆలోచన రేకెత్తించిందని అంటున్నారు. ఇందులో భాగంగా... మనోజ్ - మౌనిక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని.. జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.

ఈ విషయాన్ని త్వరలో అలగడ్డ వేదికగా వెల్లడించే అవకాశం ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో... మనోజ్ - మౌనిక ఆళ్లగడ్డకు వెళ్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న భూమా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారని అంటున్నారు. వారంతా అక్కడకు చేరుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ సమావేశం అనంతరం తమ పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ - మౌనిక కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసిన అఖిల ప్రియ గెలుపొందారు. ఈ సమయంలో అదే ఆళ్లగడ్డ నుంచే తమ పొలిటికల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాలని మనోజ్ - మౌనిక ఫిక్సయినట్లూ చెబుతున్నారు.

కాగా... గతంలో మనోజ్ తండ్రి మోహన్ బాబు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇటు మౌనిక సోదరి అఖిల ప్రియ టీడీపీగా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే... మనోజ్ - మౌనికలు జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. మనోజ్ తొలినుంచీ పవన్ తో సన్నిహితంగా ఉండటం కూడా దీనికి కారణం అని అంటున్నారు.

మరి మనోజ్ - మౌనిక జనసేనలో ఎప్పుడు చేరే అవకాశం ఉంది.. అంతకంటే ముందు దీనిపై ఎప్పుడు, ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఆసక్తిగా మారింది. మరోపక్క నేడు ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి జయంతి వేడుకలు జరుగుతున్న వేళ.. వీరి పొలిటికల్ ఎంట్రీపై ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం!!