Begin typing your search above and press return to search.

జనరేటర్ లో పంచదార... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!

ఈ సందర్భంగా... ఎస్.హెచ్.ఓ., పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు లేఖ రాస్తూ.. కాపీ టు అసిస్టెంట్ కమిషనర్, మహేశ్వరం.. మహేశ్వరం డిప్యూటీ కమిషనర్, రాచకొండ పోలీస్ కమిషనర్ అని వెల్లడించారు.

By:  Tupaki Desk   |   17 Dec 2024 7:55 AM GMT
జనరేటర్  లో పంచదార... మోహన్  బాబు భార్య సంచలన లేఖ!
X

మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం ఇప్పటికే అటు మీడియాలోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్న వేళ.. మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... జనరేటర్ లో పంచదార వేశారంటూ విష్ణు & కో పై మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆసక్తికరంగా మారిందని అంటున్న వేళ మోహన్ బాబు భార్య ఎంట్రీ ఇచ్చారు.

అవును... మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాల వ్యవహారం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని.. తనకు ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదు చేయగా.. తనకు మనోజ్ వల్ల ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది.

అనంతరం ఎన్నో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. లైసెన్స్డ్ రివాల్వర్లు సరెండర్ చేయడం.. జర్న్లిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదవ్వడం.. ఇటీవల తమ తల్లి బర్త్ డే రోజు కేకు ఇచ్చే నెపంతో ఇంట్లోకి వచ్చి జనరేటర్ లో పంచదార వేశారంటూ విష్ణు & కోపై మనోజ్ ఫిర్యాదు చేయడంతో మరోసారి మొదలైందనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలో తాజాగా మోహన్ బాబు భార్య మంచు నిర్మల మోహన్ బాబు స్పందించారు. ఈ సందర్భంగా... ఎస్.హెచ్.ఓ., పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు లేఖ రాస్తూ.. కాపీ టు అసిస్టెంట్ కమిషనర్, మహేశ్వరం.. మహేశ్వరం డిప్యూటీ కమిషనర్, రాచకొండ పోలీస్ కమిషనర్ అని వెల్లడించారు.

ఈ సందర్భంగా... డిసెంబర్ 14వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా... పెద్ద కుమారుడు విష్ణు జల్ పల్లి ఇంటికి వచ్చి కేకూ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడని... అయితే, ఇంటికి వచ్చిన మంచు విష్ణు ఫుటేజ్ ని బయటపెట్టి, గొడవ చేసినట్లు మనోజ్ లేనిపోని అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని అన్నారు.

అయితే... నా పుట్టిన రోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొని ఇంటికి వచ్చాడు.. గదిలో ఉన్న తన సామాను తీసుకున్నాడు.. ఉన్న కొద్ది సేపు నాతో ఉండి, కేక్ కట్ చేయించి, సెలబ్రేట్ చేశాడు అని తెలిపారు. ఈ సందర్భంగా... ఆ ఇంట్లో మనోజ్ కి ఎంత హక్కు ఉందో.. విష్ణుకి అంతే హక్కు ఉందని మంచు నిర్మలా మోహన్ బాబు వెల్లడించారు.

ఈ సందర్భంగా... తన పెద్ద కుమారుడు విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదని.. గొడవ చేయలేదని.. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో నిజం లేదని.. ఇంట్లో పని చేస్తున్నవాళ్లు వారికి వారే మానేశారని.. వారు పని మానేయడంలో విష్ణు ప్రమేయం ఏమాత్రం లేదని.. స్పష్టం చేశారు.

దీంతో... మంచు ఫ్యామిలీలో మంటలు ఎపిసోడ్ లో తాజాగా పోలీసులకు మంచు నిర్మలా మోహన్ బాబు రాసిన లేఖ బిగ్ ట్విస్ట్ అని అంటున్నారు నెటిజన్లు. మరి ఈ వ్యవహారంలో మరెన్ని కీలక పరిణామాలు చోటూ చేసుకుంటాయనేది వేచి చూడాలి.