Begin typing your search above and press return to search.

మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ నుంచి రిప్లై వచ్చేసింది!

ఇందులో భాగంగా... "😂😂😂😂 ఓకే శివయ్యా... నా దృష్టికోణం నాకుంది.. అదేవిధంగా మీకు కూడా ఉంటుంది.. గుర్తుపెట్టుకోండి #జస్ట్ ఆస్కింగ్" అని రియాక్ట్ అయ్యారు ప్రకాశ్ రాజ్.

By:  Tupaki Desk   |   21 Sep 2024 10:55 AM GMT
మంచు విష్ణుకు  ప్రకాశ్  రాజ్  నుంచి రిప్లై వచ్చేసింది!
X

తిరుమల లడ్డూ ప్రసాదంపై నెలకొన్న వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ వ్యవహారంపై పవన్ ట్వీట్ కు ప్రకాశ్ రాజ్ రియాక్ట్ అయితే.. ప్రకాశ్ రాజ్ రియాక్షన్ కు అనూహ్యంగా మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. ఈ సమయంలో మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ నుంచి రిప్లై వచ్చేసింది.

అవును... తిరుమల లడ్డూ మహా ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ఆరోపణలు వస్తోన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ కు నటుడు, "మా" అధ్యక్షుడు మంచు విష్ణు రిప్లై ఇచ్చారు. ఈ సమయంలో.. మంచు విష్ణు పెట్టిన పోస్టుకు ప్రకాశ్ రాజ్ కూడా నవ్వుతున్న ఎమోజీలు జోడించి రిప్లై ఇచ్చారు.

ఇందులో భాగంగా... "😂😂😂😂 ఓకే శివయ్యా... నా దృష్టికోణం నాకుంది.. అదేవిధంగా మీకు కూడా ఉంటుంది.. గుర్తుపెట్టుకోండి #జస్ట్ ఆస్కింగ్" అని రియాక్ట్ అయ్యారు ప్రకాశ్ రాజ్. ఇలా వీళ్లిద్దరి మధ్యా ఎక్స్ వేదికగా జరిగిన ఈ చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా... తిరుమల లడ్డూ వ్యవహారంపై పవన్ చేసిన ట్వీట్ ను కోట్ చేస్తూ స్పందించిన ప్రకాశ్ రాజ్... "మీరు డిప్యుటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి.. మీరెందుకు అనవసరంగా భయాందోళనలు కల్పిస్తూ, దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు" అని ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన మంచి విష్ణు... "శ్రీ ప్రకాశ్ రాజ్... దయచేసి మీరు అంతలా నిరుత్సాహపడకండి. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు.. నాలాంటి కోట్లాది మంది హిందువుల నమ్మకానికి ప్రతీక. డిప్యూటీ సీఎం పవన్.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే కోరారు.. ధర్మ పరిరక్షణ కోసం తగు చర్యలు తీసుకుంటారు.. #మీ పరిధిలో మీరు ఉండండి" అని స్పందించారు.

ప్రస్తుతం వీరిద్దరి మధ్యా ఎక్స్ వేదికగా జరిగిన ఈ చర్చ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గతంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తిరుమల లడ్డు వివాదంపై స్పందిస్తూ వార్తల్లో నిలిచారు!