Begin typing your search above and press return to search.

ఏపీ రాజకీయాలపై స్పందించిన మంచు లక్ష్మి... ఫుల్ల్ ఇంట్రస్టింగ్!

మంచు లక్ష్మి. ఇందులో భాగంగా... "వావ్... ఏపీ రాజకీయాలు బలే ఇంట్రస్ట్ గా మారాయి" అంటూ ట్వీట్ చేశారు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 10:58 AM GMT
ఏపీ రాజకీయాలపై స్పందించిన మంచు లక్ష్మి... ఫుల్ల్  ఇంట్రస్టింగ్!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పటినుంచీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు కేంద్రంగానే ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమయంలో మంచు లక్ష్మి ఆన్ లైన్ వేదికగా ఏపీ రాజకీయాలపై స్పందించారు.

ఏన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత జైలులో ఉంటే పార్టీ మొత్తం చల్లబడిందనే కామెంట్లు వినిపిస్తున్న సమయంలో... జనసేన అధినేత రంగంలోకి దిగి... టీడీపీతో కలిసే జనసేన రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతుందని తెలిపారు. దీంతో ఇది అందరికీ తెలిసిన విషయమే... ఇదేమీ బ్రేకింగ్ కాదంటూ వైసీపీ వెటకారమాడింది.

మరోపక్క లండన్ పర్యటన పూర్తిచేసుకుని ఏపీకి వచ్చిన జగన్ తాజాగా నిడదవోలు సభలో చంద్రబాబు, పవన్ తో వారి అనుకూల మీడియా జనాలపైనా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. జైల్లో ములాకత్ అని వెళ్లి మిలాకత్ అయ్యారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అడ్డంగా దొరికాడని... ప్రశ్నిస్తానన వ్యక్తి మౌనంగా ఉన్నారని కామెంట్స్ చేశారు.

ఇలా అత్యంత రసవత్తరంగా ఏపీ రాజకీయాలు మారుతున్న తరుణంలో... అదే విషయాన్ని ట్విట్టర్ లో తెలిపారు మంచు లక్ష్మి. ఇందులో భాగంగా... "వావ్... ఏపీ రాజకీయాలు బలే ఇంట్రస్ట్ గా మారాయి" అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ పై రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

కాగా... గడిచిన ఎన్నికల్లో మంచు మోహన్ బాబు, విష్ణు లు వైసీపీకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా భూమా ఇంటి అల్లుడైన మంచు మనోజ్.. చంద్రబాబుని వెళ్లి కలిశారు. దీంతో... మనోజ్ టీడీపీలోకి వెళ్లబోతున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే మనోజ్ ఆ వార్తలను ఖండించారు. జస్ట్ బ్లెస్సింగ్స్ కోసమే బాబుని కలిసినట్లు తెలిపారు.

మరొవైపు భూమా కుటుంబం నుంచి వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ, నంద్యాల సీట్లు కేటాయించాలంటూ అఖిలప్రియ తెలుగుదేశం అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మనోజ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మనోజ్ వాటిని ఖండించారు.

ఈ పరిస్థితుల్లో ఏపీలో రాజకీయాలు ఇంట్రస్టింగ్ గా మారుతున్నాయ్యంటూ మంచు లక్ష్మి ఆన్ లైన్ వేదీక్గా స్పందించారు. ఈసారి మీరు ఏ గట్టున ఉంటారంటూ నెటిజన్లు కామెంట్లు పడుతున్నారు.