మందాకినికి ఇద్దరు పిల్లలూనా?
డాక్టర్ కాగ్యూర్ రింపోచే ఠాకూర్ ను పెళ్లాడి దుబాయ్ లో సెటిల్ అయ్యిందని చెబుతారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా వారిలో కుమారుడు పేరి రబ్బిల్.. కుమార్తె పేరు రబ్జీ ఇనయా!
By: Tupaki Desk | 20 Dec 2023 7:30 AM GMTగత రెండు మూడు రోజులుగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పేరు ప్రపంచ వ్యాప్తంగా మరోసారి మారుమోగుతుంది. ఈ సమయంలో దావూదు కు సబంధించిన కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. అతని ఆస్తుల లెక్కలు, విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం వివరాలు, అతడికి నాడు ఉన్న సంబంధాలు, సినీ పరిచయాలు మొదలైన వివరాలు మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి.
అవును... దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ డాన్ గా ఎదిగి.. ప్రపంచానికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారడం సంగతి ఒకెత్తు అయితే... బాలీవుడ్ హీరోయిన్ తో అతడు సాగించిన ప్రేమాయణం మరొకెత్తు అని అంటుంటారు. ఎంత వేగంగా ఎదిగి స్టార్ గా మారిందో.. దావూద్ పరిచయంతో అంతే వేగంగా కెరీర్ లో పతనం చూసిందని చెబుతుంటారు. వాస్తవానికి మందాకి అందానికి దావూద్ ముగ్దుడైపోయాడని చెబుతారు. అప్పట్లో ఆమె ప్రేమకోసం పరితపించేవాడని అంటుంటారు.
ఎలాగైతే అనుకున్నట్లుగానే ఆమె ప్రేమను పొందాడు. ఇక అక్కడి నుంచి మొదలు చెట్టాపట్టాలేసుకుని దేశవిదేశాలు చుట్టారని చెబుతుంటారు. ఈ క్రమంలోనే దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ఇద్దరూ పక్క పక్కన కూర్చున్న ఫోటో బయటకు రావడంతో... మందాకినిపై ఆరోపణలు ఎక్కువైపోయాయి. దీంతో బాలీవుడ్ ఆమెను క్రమక్రమంగా దూరం పెట్టింది. ఫలితంగా ఎక్కడో ఉండాల్సిన ఆమె సినీ కెరీర్ అక్కడే పతనమైపోయింది!
కట్ చేస్తే... మందాకినీ ఫిల్మ్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యింది. ఈ సమయంలో ప్రఖ్యాత వైద్యుడు.. డాక్టర్ కాగ్యూర్ రింపోచే ఠాకూర్ ను పెళ్లాడి దుబాయ్ లో సెటిల్ అయ్యిందని చెబుతారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా వారిలో కుమారుడు పేరి రబ్బిల్.. కుమార్తె పేరు రబ్జీ ఇనయా!
ఇలా మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా పేరుసంపాదించుకుని, ఏడాదికి ఆరు సినిమాలకు తగ్గకుండా కెరీర్ లో వేగంగా దూసుకుపోతున్న మందాకినీ కెరీర్... అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పరిచయం, ప్రేమతో పతనం అయిపోయిందనే చెప్పాలి.
మరోపక్క 1993 ముంబై పేళుల్ల తర్వాత దావూద్ ఇబ్రహీం తన ఫ్యామిలీతో పాటుగా పాకిస్తాన్ లోనే ఉంటున్నాడని.. అక్కడే స్థిరపడ్డాడని.. అతను కరాచీలోనే ఉన్నాడనడానికి పక్కా ఆధారాలున్నాయని భారత్ వెల్లడించింది. ఈ సమయంలో భారత్ తో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సైతం 2003లో దావూద్ ను మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ క్రిమినెల్ గా ప్రకటించింది.