Begin typing your search above and press return to search.

టీ-కాంగ్రెస్‌కు సామాజిక వ‌ర్గాల సంక‌టం!

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ద్ధ‌తి మార్చుకోవాలంటూ.. మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి(ఎంఆర్‌పీఎస్‌) జాతీయ అధ్య‌క్షుడు మంద కృష్ణ మాదిగ రేవంత్ స‌ర్కారుకు గ‌ట్టి వార్నింగే ఇచ్చారు.

By:  Tupaki Desk   |   21 Jun 2024 2:45 AM GMT
టీ-కాంగ్రెస్‌కు సామాజిక వ‌ర్గాల సంక‌టం!
X

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌కి ఇబ్బందులు పెరుగుతున్నాయి. పార్టీ గెలిచి.. అధికారంలో ఉంద‌నే కానీ.. బ‌ల‌మైన మెజారిటీ లేదు. అంటే.. స్వ‌ల్ప మెజారిటీతో ముందుకు సాగుతోంది. ఈ ప‌రిణామం ఇత‌ర వ‌ర్గాల‌కు ఆయుధాలు ఇప్పించింద‌నే వాద‌న వినిపిస్తోంది. త‌మ డిమాండ్లు నెరవేర‌క‌పోతే.. ఆయా వ‌ర్గాలు బెదిరించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఉదాహ‌ర‌ణ‌కు బీసీలు ఒక‌వైపు.. త‌మ డిమాండ్లు వినిపిస్తున్నారు. వాటిని నెర‌వేర్చాల‌ని కూడా అంటున్నారు.

ఇక‌, ఇప్పుడు మాదిగ సామాజిక‌వ‌ర్గం కూడా.. మ‌రింత దూకుడు పెరిగింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ద్ధ‌తి మార్చుకోవాలంటూ.. మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి(ఎంఆర్‌పీఎస్‌) జాతీయ అధ్య‌క్షుడు మంద కృష్ణ మాదిగ రేవంత్ స‌ర్కారుకు గ‌ట్టి వార్నింగే ఇచ్చారు. ''పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఉండ‌దు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండరు'' అని మంద.. గ‌ట్టి వార్నింగే ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అంటే.. అటు బీసీలు.. ఇటు ఎస్సీలు కూడా రేవంత్‌పై ఆగ్ర‌హంతో ఉన్నారు.

దీనికి కార‌ణం.. ఏంటి? అనే విష‌యాల‌ను గ‌మ‌నిస్తే.. ఆయా వ‌ర్గాల‌కు ఇచ్చిన హామీల అమ‌లులో ప్ర‌భు త్వం వెనుక‌డుగు వేయ‌డ‌మే. వీటిని ఎప్పుడు అమ‌లు చేస్తార‌న్న విష‌యాన్నీ వెల్ల‌డించ‌డం లేదు. దీంతో ఆయా వ‌ర్గాల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెగుతోంది. ఈ నేప‌థ్యంలోనే మంద‌వంటి వారు తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ మాదిగ‌ల‌కు సీటు ఇవ్వ‌కుండా.. మోసం చేశార‌ని.. తాము తలుకుంటే.. పార్టీ ని అధికారంలో నుంచి దించేయ‌డం ఖాయ‌మ‌ని ఆయన వ్యాఖ్యానించారు.

''కాంగ్రెస్ పార్టీ పద్ధతి మార్చుకోవాలి. లేదంటే పార్టీ ఉండదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్న‌ప్ప టికీ.. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ సీట్లు ఎందుకు గెలవలేదు!'' అని మంద ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నా ర్హం. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. మ‌రికొన్ని రోజుల్లోనే.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు రానున్నాయి ఈ నేప‌థ్యం లో ఇలా సామాజిక వ‌ర్గాల నుంచి సెగ పెరుగుతుండ‌డం సంక‌టంగా మారింది.