Begin typing your search above and press return to search.

మంగళగిరిలో బిగ్ ట్విస్ట్ : లోకేష్ తో పోటీకి లావణ్య సిద్ధం !

లావణ్య అంటే ఎవరో కాదు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. 2009లో కాండ్రు కమల ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

By:  Tupaki Desk   |   1 March 2024 7:12 PM GMT
మంగళగిరిలో బిగ్ ట్విస్ట్ : లోకేష్ తో పోటీకి లావణ్య సిద్ధం !
X

ఏపీలో హాట్ సీట్లలో ఒకటిగా చెప్పుకునే మంగళగిరిలో వైసీపీ రాజకీయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సడెన్ గా అక్కడ ఇంచార్జిని పార్టీ మార్చేసింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఈ నిర్ణయం పార్టీ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా ఇంఛార్జిగా ఉన్న గంజి చిరంజీవి ప్లేస్ లో లావణ్య అనే కొత్త ముఖాన్ని తెచ్చారు. లావణ్య అంటే ఎవరో కాదు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. 2009లో కాండ్రు కమల ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

ఆమెకు మంగళగిరిలో మంచి పట్టు ఉంది. ఆమె కూడా చేనేత సామాజిక వర్గానికి చెందిన వారే. దాంతో పాటు 1999, 2004లో రెండు సార్లు ఇదే సీటు నుంచి గెలిచిన మురుగుడు హనుమంతరావుతో ఆమె వియ్యం అందుకున్నారు. అలా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల పక్షాన లావణ్య ఉమ్మడి అభ్యర్ధిగా వైసీపీ హై కమాండ్ ఎంపిక చేసింది.

ఇక పోతే గంజి చిరంజీవికి టికెట్ ఇస్తూ పార్టీ మూడు నెలల క్రితం నిర్ణయం తీసుకుంది. కానీ ఆయన గ్రాఫ్ పెద్దగా పెరగకపోవడం తో పాటు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కమల, హనుమంతరావు ఆయనకు సహాయం చేయక పోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక పార్టీకి రాజీనామా చేసి తిరిగి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి కూడా గంజి చిరంజీవి కంటే బెటర్ క్యాండిడేట్ పెడితే గెలుపు ఖాయం అని హై కమాండ్ కి సూచించారు అని అంటున్నారు.

ఇక స్వయంగా గ్రౌండ్ లోకి దిగి వైసీపీ విజయావకాశాలను పూర్తిగా రివ్యూ చేస్తూ వస్తున్న విజయసాయిరెడ్డి కూడా గంజి చిరంజీవి ప్లేస్ లో కొత్త వారికి చాన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పారు అని అంటున్నారు. దాంతో వైసీపీ హై కమాండ్ వ్యూహం మార్చింది. ఈ పరిణామాల నేపధ్యం నుంచే లావణ్య పేరు బయటకు వచ్చింది.

ఆమెకే టికెట్ ఖరారు అని అంటున్నారు. దాంతో ఆమె లోకేష్ కి యాంటిగా నిలబడి వైసీపీ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు. మహిళగా చేనేత సామాజిక వర్గం నుంచి ప్రతినిధిగా లావణ్య ఉంటారని దాంతో గెలుపు సులువు అవుతుందని వైసీపీ లెక్క వేస్తోంది. ఆమెకు మద్దతుగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే తో పాటు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అహరహం కృషి చేస్తారు అని అంటున్నారు. ఇక గంజి చిరంజీవికి ఇప్పటికే నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఈ దఫా పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు.