Begin typing your search above and press return to search.

వందేళ్ల క్రితం.. మామిడిపంట్ల చోరీ కేసు తీర్పు కాపీ తాజాగా దొరికింది!

మామిడిపండ్లను దొంగతనం చేసిన వైనానికి సంబంధించిన కేసు ఒకటి వందేళ్ల క్రితం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   20 May 2024 4:58 AM GMT
వందేళ్ల క్రితం.. మామిడిపంట్ల చోరీ కేసు తీర్పు కాపీ తాజాగా దొరికింది!
X

మామిడిపండ్లను దొంగతనం చేసిన వైనానికి సంబంధించిన కేసు ఒకటి వందేళ్ల క్రితం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మహారాష్ట్రలోని ఠాణే న్యాయస్థానం వెలువరించిన తీర్పు ప్రతి తాజాగా దొరికింది. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి అప్పటి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారింది. ఇంతకూ వందేళ్ల నాటి తీర్పు కాపీ తాజాగా ఎలా బయటకు వచ్చిందన్న విషయానికి వస్తే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. చోరీ కేసులో నిందితులుగా ఉన్న వారిని అప్పటి న్యాయమూర్తి నిర్దోషులుగా ప్రకటించటం వెనకున్న వైనం తెలిస్తే.. ఆ రోజుల్లో ఇంత ముందుచూపుతో ఆలోచించారా? అన్న భావన కలుగక మానదు.

పుణెలో ఉండే న్యాయవాది పునీత్ మహిమాకర్ ఇటీవల ఇల్లు మారారు. ఈ క్రమంలో పాత ఇంట్లోని సామాన్లను కొత్త ఇంటికి షిప్టు చేశారు. ఈ క్రమంలో పాత ఇంటి అటక మీద చాలా ఏళ్లుగా ఉన్న ఒక సంచిని చూశారు. ఎప్పుడూ చూసినా.. దాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. తాజాగా ఇంటిని ఖాళీ చేయాల్సి రావటంతో.. ఆ సంచిలో ఏముందన్నది చూశారు.

అందులో వందేళ్ల క్రితం నాటి తీర్పు కాపీ లభించింది.అంతేకాదు.. మరికొన్ని ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయి. తనకు లభించిన వందేళ్ల క్రితం నాటి తీర్పు కాపీని కొన్ని మీడియా సంస్థలతో షేర్ చేసుకున్నారు సదరు న్యాయవాది.

క్రౌన్ వర్సెస్ వెర్సెస్ అంజీలో అల్వారీస్.. మరో ముగ్గురు నిందితులుగా ఉన్న కేసుకు సంబంధించిన వివరాల్ని చూస్తే.. 185 పచ్చ మామిడి పండ్లను చోరీ చేసిన నలుగురు యువకుల్ని ఖైదు చేశారు. వీరిపై ఐపీసీ 379/109 కింది అభియోగాలు మోపారు. వీరు మామిడిపండ్లను దొంగలించినట్లుగా ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది వాదిస్తూ.. చోరీచేసిన మామిడిపండ్లను నిందితులు మార్కెట్ లోని ఒక వ్యాపారికి అమ్మినట్లుగా తాము చూసినట్లుగా కొందరు సాక్ష్యం కూడా ఇచ్చారు.

ఈ వాదనను డిఫెన్స్ న్యాయవాది నిందితులు ఎలాంటి తప్పు చేయలేదని వాదించారు. అయితే.. నలుగురు యువకులు చిన్న వయసులో ఉండటం.. ఈ కేసులో శిక్ష విధించటం ద్వారా వారి జీవితాలను నాశనం చేయాలని తాను అనుకోవటం లేదని పేర్కొన్న అప్పటి న్యాయమూర్తి టీఏ ఫెర్నాండెజ్ వారిని మందలిస్తూ దోషులుగా తేలుస్తూ తన తీర్పును వెలువరించారు. బ్రిటిష్ ప్రభుత్వంలో సైతం కొందరు న్యాయమూర్తులు ఎంతటి పెద్ద మనసుతో వ్యవహరించారన్న దానికి నిదర్శనంగా తాజా తీర్పు ప్రతి నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.