Begin typing your search above and press return to search.

మణిపూర్ - పార్లమెంటు దద్దరిల్లిపోయింది

గడచిన రెండున్నర నెలలుగా మణిపూర్ లో జరుగుతున్న అల్లర్ల పై చర్చకు ప్రభుత్వం అనుమతించాల్సిందే అని ఇండియా కూటమి, ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.

By:  Tupaki Desk   |   1 Aug 2023 5:17 AM GMT
మణిపూర్ - పార్లమెంటు దద్దరిల్లిపోయింది
X

మణిపూర్ అల్లర్ల పై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లిపోయాయి. గడచిన రెండున్నర నెలలుగా మణిపూర్ లో జరుగుతున్న అల్లర్ల పై చర్చకు ప్రభుత్వం అనుమతించాల్సిందే అని ఇండియా కూటమి, ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే ప్రభుత్వం మాత్రం చర్చకు అనుమతివ్వటంలేదు.

చర్చల కు అనుమతి వివాదం పై రోజుల తరబడి సభా కార్యక్రమాలు వాయిదా పడినా పర్వాలేదు కానీ చర్చలకు మాత్రం అనుమతించకూడదని నరేంద్రమోడీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు మణిపూర్ అల్లర్ల పై చర్చకు అనుమతించడాన్ని మోడీ అవమానంగా భావిస్తున్నారు.

చర్చకు మోడీ ప్రభుత్వం అనుమతించదని ముందుగా ఇండియా కూటమి అనుమానించే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. దీన్ని రిజెక్ట్ చేయలేక స్పీకర్ ఓంబిర్లా అనుమతించారు. అయితే అవిశ్వాసం పై చర్చ ఎప్పుడు మొదలవుతుంది ? ఓటింగ్ ఎప్పుడు నిర్వహిస్తారని మాత్రం చెప్పలేదు. బహుశా ఈరోజో లేకపోతే రేపే ప్రకటన చేయవచ్చని అనుకుంటున్నారు. అయితే అప్పటివరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని ఇండియా కూటమి ఎంపీలు అనుకున్నారు.

ఈ మధ్యనే మణిపూర్లో రెండు రోజులు పర్యటించి వచ్చారు కదా అందుకనే వాళ్ళ దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుంది. అందుకనే చర్చ జరగాల్సిందే అని పట్టుబట్టారు. దీన్ని తప్పించేందుకు స్పీకర్ విదేశీ ప్రతినిదుల ను సాకుగా చూపించారు. పార్లమెంట్ పనితీరును పరిశీలించేందుకు విదేశీ ప్రతినిధులు వచ్చారు కాబట్టి ఎంపీలందరూ సభ నిర్వహణకు సహకరించాలని కోరారు. అయితే ఇందుకు ఎంపీలు అంగీకరించలేదు. దీంతో చాలాసార్లు గొడవలై సమావేశాల కు అంతరాయం ఏర్పడింది.

నరేంద్ర మోదీ సభ కు రావాల్సిందే అని తమ ప్రశ్నల కు సమాధానం చెప్పి తీరాల్సిందే అని కూటమి ఎంపీలు పదేపదే డిమాండ్లు చేశారు. వీళ్ళెంత డిమాండ్ చేసినా మోడీ పట్టించుకోలేదు. దాంతో ఇటు లోక్ సభ అటు రాజ్యసభ గొడవలతో దద్దరిల్లిపోయింది.

సరే పార్లమెంటు సమావేశాలు సరిగా జరగకపోవటానికి కారణాలు నువ్వంటే కాదు నువ్వే అని రెండువైపుల ఎంపీలు ఆరోపణలు చేసుకోవటం మామూలే. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే మణిపూర్ అల్లర్లపైన చర్చించటానికి నరేంద్రమోడీ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది. ఇంతకుమించిన ముఖ్యమైన అంశాలు ప్రభుత్వానికి ఏముంటాయి ? ఇక్కడే మోడీ లోని భయం అందరికీ తెలిసిపోతోంది.