పాకిస్థాన్ లోని మన్మోహన్ సింగ్ ఇల్లు... భారత్ ఎప్పుడొచ్చారు?
మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త, ఆధునిక భారత రూపకర్త మన్మోహన్ (92) కన్నుమూశారు.
By: Tupaki Desk | 27 Dec 2024 4:45 AM GMTమాజీ ప్రధాని, ఆర్థిక వేత్త, ఆధునిక భారత రూపకర్త మన్మోహన్ (92) కన్నుమూశారు. గురువారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా... రాత్రి 9:51 గంటలకు మన్మోహన్ మరణించారని ఎయిమ్స్ మీడియా సెల్, ప్రొఫెసర్ ఇన్ ఛార్జ్ డాక్టర్ రిమా దాదా తెలిపారు.
ఈ సందర్భంగా 10 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించడమే కాకుండా.. ఆధునిక భారత రూపకర్త పేరును సంపాదించుకున్నారు మన్మోహన్ సింగ్. ప్రధానిగా పదేళ్లు పనిచేసిన ఆయన గత పదేళ్లుగా ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్ లోని 3వ విశాలమైన బంగ్లాలో ఉంటున్నారు. ప్రధానిగా పనిచేసిన ఆయనకు నిత్యం ఎన్.ఎస్.జీ. భద్రత ఉంటుంది!
మూడు ఎకరాల స్థలంలో విశాలమైన టైప్-8 బంగ్లా ఆయన మరణించేనాటికి దేశ రాజధానిలో ఆయన చిరునామాగా ఉంది. అయితే... స్వాతంత్రానికి ముందు జన్మించిన మన్మోహన్ సింగ్ జన్మస్థలం ప్రస్తుతం పాకిస్థాన్ లోని పశ్చిమ పంజాబ్ లో ఉండగా.. ఆయన చిన్ననాటి ఇంటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
అవును... భారతదేశం గర్వించదగిన ఆర్థిక వేత్త, అధునిక భారత రూపకర్త అయిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్.. 1932 సెప్టెంబర్ 26న పాకిస్థాన్ లోని పశ్చిమ పంజాబ్ లో గహ్ అనే ప్రాంతంలో జన్మించారు. అయితే... 1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్ కు వచ్చేసింది.
ఈ క్రమంలో... 1958 సెప్టెంబర్ 14న గురుశరణ్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.