Begin typing your search above and press return to search.

మోదీపై మన్మోహన్ అభిప్రాయం ఇదే.. ఎన్నికల ముంగిట స్పష్టం

ఈ విశాల భారతదేశానికి వరుసగా పదేళ్లు ప్రధానిగా పనిచేసిన నాయకలు అత్యంత అరుదు.

By:  Tupaki Desk   |   27 Dec 2024 3:30 PM GMT
మోదీపై మన్మోహన్ అభిప్రాయం ఇదే.. ఎన్నికల ముంగిట స్పష్టం
X

ఈ విశాల భారతదేశానికి వరుసగా పదేళ్లు ప్రధానిగా పనిచేసిన నాయకలు అత్యంత అరుదు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత మన్మోహన్ సింగ్ కు మాత్రమే ఆ రికార్డు దక్కింది. దీనిని ప్రస్తుత ప్రధాని మోదీ అధిగమించారు. ఇక్కడ విషయం ఏమంటే మన్మోహన్ తర్వాత ప్రధాని అయినది మోదీనే. 2004 నుంచి వీరిద్దరే దేశ అత్యున్నత పదవిలో కొనసాగడం.

మన్మోహన్ ను దించేసిన మోదీ

2014లో మరోసారి (వరుసగా మూడోసారి) గనుక కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడి ఉంటే మన్మోహన్ సింగ్ నే ప్రధాని అయ్యేవారేమో. కానీ, మోదీ మేనియాలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం.. మన్మోహన్ మాజీ కావడం చరిత్ర. ఈ విధంగా మన్మోహన్ ను పరోక్షంగా ఓడించారు మోదీ.

జీవిత చరమాంకంలో..

మోదీ ప్రధాని అయినప్పటి నుంచి మన్మోహన్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో మన్మోహన్ సభ్యత్వం ముగిసింది. వయోభారం రీత్యా మళ్లీ బరిలో దిగలేదు. ఇక సరిగ్గా ఈ సమయంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో మన్మోహన్ గళాన్ని వినిపించారు. మోదీ ప్రభుత్వ విధానాలు, ఆయన వైఖరిపై లేఖ రాశఆరు. అయితే, అప్పటికే లోక్‌ సభ ఎన్నికలు తుది దశకు వచ్చాయి.

విద్వేషానికి మోదీ ఆజ్యం..

మన్మోహన్ తన లేఖలో మోదీని తీవ్రంగా తప్పుబట్టారు. విద్వేష, అనుచిత ప్రసంగాలతో ప్రధాని కార్యాలయం హుందాతనాన్ని దిగజార్చారని మండిపడ్డారు. యువత గురించి ప్రస్తావించారు. సైనిక నియామకాల్లో నాలుగేళ్ల తర్వాత రిటైర్ తప్పనిసరి అంటూ కేంద్రం తీసుకొచ్చిన అగ్నివీర్‌ పథకాన్ని ఉద్దేశిస్తూ యువతలో దేశభక్తి, సాహసం, సేవానిరతి నాలుగేళ్లే ఉంటాయని బీజేపీ భావిస్తోందని.. ఇదో బూటకపు జాతీయవాదం అని మండిపడ్డారు. మోదీ ఎన్నికల ప్రసంగాలన్నీ విభజన, విద్వేష స్వభావం కలిగినవేనన్నారు. ఓ వర్గం, ప్రతిపక్షాలపై ఏ ప్రధానీ ఇలాంటి ప్రసంగాలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను భేద భావంతో చూడని తనకూ కొన్ని తప్పుడు ప్రకటనలను ఆపాదించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి శక్తుల నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మన్మోహన్ తన లేఖలో పిలుపునిచ్చారు.

ప్రసిద్ధ ఆర్థికవేత్త అయిన మన్మోహన్.. మోదీ ఆర్థిక విధానాలను తన లేఖలో ఎండగట్టారు. పెద్ద నోట్ల రద్దు, లోపాల పుట్ట జీఎస్టీ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకులకు లోనైందని మన్మోహన్ విశ్లేషించారు.

మన్మోహన్ పిలుపు ఎలా ఉన్నా దేశ ప్రజలు వరుసగా మూడోసారి మోదీకి పట్టం కట్టారు. మన్మోహన్ కు మిస్సయిన హ్యాట్రిక్ ను.. కొద్దిగా ఆధిక్యం తగ్గించి మోదీకి కట్టబెట్టారు.