Begin typing your search above and press return to search.

మోడీ వ్యాఖ్యల దుమారం.. మన్మోహన్ వీడియో బయటికి

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి

By:  Tupaki Desk   |   22 April 2024 12:39 PM GMT
మోడీ వ్యాఖ్యల దుమారం.. మన్మోహన్ వీడియో బయటికి
X

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీలను మచ్చిక చేసుకునే తీరును తప్పుబడుతూ.. మోదీ ఓ ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలోని సంపద మొత్తాన్ని ముస్లింలకే పంచుతుందని మోడీ ఈ సభలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ వాళ్లే కాక తటస్థులు కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముస్లింల మీద ఈ సమయంలో ఇంత ద్వేషం చూపించాలా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ వాళ్లు దీన్నొక ఆయుధంలా వాడుతూ బీజేపీకి ముస్లింల మీద ఉన్న ద్వేషానికి ప్రతీకగా దీన్ని చూపిస్తున్నారు.

ఐతే ప్రధాని వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ 2004-20914 మధ్య యూపీఏ ప్రభుత్వంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ చేసిన ఓ ప్రసంగానికి సంబంధిన వీడియోను పోస్ట్ చేసింది. 2006లో అప్పటి ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలపై జాతీయ భద్రతా మండలి ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మన్మోహన్ మాట్లాడుతూ.. ‘‘మైనారిటీలకు, ముఖ్యంగా ముస్లింలకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందేలా మేం వినూత్న ప్రణాళికలు తీసుకురాబోతున్నాం. దేశంలోని వనరులపై వారికే తొలి హక్కు ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూనే ప్రధాని మోదీ ఇప్పుడు ప్రసంగించారని.. కాంగ్రెస్ పార్టీకి తమ ప్రధాని మీదే నమ్మకం లేదని ఎద్దేవా చేస్తూ బీజేపీ సోషల్ మీడియాలో ఎదురుదాడి చేసింది. మొత్తానికి ముస్లింల చుట్టూ నడుస్తున్న రాజకీయం ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.