జైల్లో వేసినా రేవంత్ రెడ్డిపై క్రిశాంక్ పోరాటం వైరల్
తనకు ఏ పాపం తెలియదని జైలు నుంచి విడుదల చేసిన లేఖలో పేర్కొన్నాడు.
By: Tupaki Desk | 6 May 2024 7:54 AM GMTఉస్మానియా యూనివర్సిటీ పేరుతో తప్పుడు సర్క్యులర్ మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వరల్ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయి జైల్లో ఉన్న క్రిశాంక్ సీఎం రేవంత్ రెడ్డికి సవాలు చేస్తున్నాడు. తన రాజకీయ భవిష్యత్ కోసం తన జీవితాన్ని వాడుకుంటున్న కాంగ్రెస్ నేతల తీరును తప్పుబడుతున్నాడు. ఈ పోరాటంలో ఎంత దాకైనా వెళ్తానని చెబుతున్నాడు. తనకు ఏ పాపం తెలియదని జైలు నుంచి విడుదల చేసిన లేఖలో పేర్కొన్నాడు.
ఫోర్జరీ పోస్టులు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం తన ఉద్దేశం కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుడు దారిలో వెళ్లేలా చేస్తున్నారని విమర్శించారు. సీఎంగా ప్రమాణం చేసిన నాటి నుంచి తప్పుడు దారిలోనే వెళ్తున్నట్లు తెలుస్తోందన్నారు. అందుకే తనపై తప్పుడు కేసులు బనాయించి లోపల వేయించారని గుర్తు చేశారు.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తనను లోపల వేయిస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో లేనిపోని కేసులు పెట్టి తనను జైల్లో పెట్టించారన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందనే ధీమా ఉందన్నారు. అందుకే తనకు విజయం వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తన కోసం వాదిస్తున్న న్యాయవాదులు, జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రజాస్వామ్య దేశంలో కేసులు తనకు కొత్తేమీ కాదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన మాట వినకపోతే ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి ఎన్నాళ్లు జైళ్లలో ఉంచుతారో చూస్తానంటున్నారు. సత్యమేవ జయతే సత్యమే గెలుస్తుందని చెబుతున్నాడు. అహింస, ధర్మం కోసం పోరాటం చేస్తానన్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల పక్షాన ముందుంటానని పేర్కొన్నారు.
ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా తనకు భయం లేదంటున్నాడు. ధర్మం కోసం పోరాటం చేయడంలో ఎలాంటి ముప్పు ఉండదంటన్నాడు. భవిష్యత్ లో మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నాడు. ఈనేపథ్యంలో క్రిశాంక్ జీవితం పోరాటాలతోనే ముడిపడి ఉందని చెబుతున్నాడు. న్యాయం గెలిచే వరకు విశ్రమించేది లేదని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.