Begin typing your search above and press return to search.

ఏపీలో దీపావళికి ఉచిత గ్యాస్ పై కీలక అప్ డేట్!

అవును.. ఉచిత గ్యాస్ సిలెండర్ పథకం ఈ దీపావళి నుంచి ప్రారంభం కానుంది.

By:  Tupaki Desk   |   25 Oct 2024 9:33 AM GMT
ఏపీలో దీపావళికి ఉచిత గ్యాస్  పై కీలక అప్  డేట్!
X

ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన "ఏడాదికి మూడు సిలెండర్ల ఉచిత గ్యాస్" కార్యక్రమం దీపావళి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా తాజాగా సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. ఈ ప్రాసెస్ మొత్తాన్ని సవివరంగా వివరించారు.

అవును.. ఉచిత గ్యాస్ సిలెండర్ పథకం ఈ దీపావళి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా... ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ బుక్కింగ్స్ ప్రారంభాంవుతాయని.. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి గ్యాస్ సిలెండర్లు బుక్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. అలా బుక్ చేసుకున్న 24 నుంచి 48 గంటల్లో సిలిండర్ ను అందిస్తామని ఆయిల్ కంపెనీలు చెప్పినట్లు తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో అయితే 24 గంటల్లోనే అందించే అవకాశం ఉందని.. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 48 గంటలలోపు అందిస్తామని చెప్పినట్లు మంత్రి వెల్లడించారు. ఇక, సిలిండర్ అందిన అనంతరం మరో 48 గంటల్లోgaa వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని మంత్రి తెలిపారు.

ఈ సమయంలో కోటీ ఏభై ఐదు లక్షల కనెక్షన్స్ కోసం ఆయిల్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయిల్ కంపెనీలకు రూ.894 కోట్లు అందిస్తామని తెలిపారు. ఇక అర్హత (గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్) ఉండి ఈ పథకం అందకపోతే టోల్ ఫ్రీ నెంబర్ - 1967కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు.

ఇదె సమయంలో... అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకూ ఈ సిలెండర్ ఎవరైనా బుక్ చేసుకొవచ్చని.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా బుక్ చేసుకొవచ్చని తెలిపారు. ఇక రెండో విడతలో భాగంగా.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకూ ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చని.. మూడో విడతలో భాగంగా.. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకూ బుక్ చేసుకోవచ్చని వివరించారు.