Begin typing your search above and press return to search.

ఘాటు విమర్శ... "జనసేనను మనోహర్ మానభంగం చేస్తున్నాడు"

గతంలో రాజానగరం నియోజకవర్గ ఇన్‌ చార్జిగా పనిచేసిన మేడా గురుదత్త ప్రసాద్‌ సహా 100 మంది ఆ పార్టీకి రాజీనామా చేయగా... ఆ తర్వాత పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమారి జనసేనకు రాజీనామా చేసారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 4:39 AM GMT
ఘాటు విమర్శ... జనసేనను మనోహర్  మానభంగం చేస్తున్నాడు
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుతో ములాకత్ అనంతరం పవన్ కల్యాణ్ ఒక సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసే పోటీ చేస్తాయని ఆయన ప్రకటించారు. అయితే ఆ ప్రకటన అనంతరం చాలామంది జనసేన నేతలు పూర్తిగా హర్ట్ అయ్యారని.. ఇంతోటి దానికి కొత్త పార్టీ పెట్టడం ఎందుకని కామెంట్లు వినిపించాయని అన్నారు. ఈ నేపథ్యంలో వరుస రాజీనామాలు చోటు చేసుకున్నాయి!

టీడీపీతో పొత్తు ప్రకటన ఆత్మాభిమానం ఇష్యూగా పరిగణించిన కొంతమంది జనసేన కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. గతంలో రాజానగరం నియోజకవర్గ ఇన్‌ చార్జిగా పనిచేసిన మేడా గురుదత్త ప్రసాద్‌ సహా 100 మంది ఆ పార్టీకి రాజీనామా చేయగా... ఆ తర్వాత పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమారి జనసేనకు రాజీనామా చేసారు. అనంతరం నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి.. పార్టీకి గుడ్‌ బై చెప్పారు.

అనంతరం వైసీపీలో జాయిన్ అయిన కేతంరెడ్డి... తాజాగా జనసేనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ లక్ష్యంగా కేతంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఆకాశం అయితే... మనోహర్ బ్లాక్ హోల్ అని అన్నారు. ఈ సందర్భంగా జనసేననును మనోహర్ మానభంగం చేస్తున్నాడంటూ కేతంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు! ప్రస్తుతం కేతంరెడ్డి చేసిన విమర్శలు జనసేనలో హాట్ టాపిక్ అయ్యాయని తెలుస్తుంది!

అవును... నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారంటూ కేతంరెడ్డి వినోద్ రెడ్డి మండిపడ్డారు. జనసేనను నాదెండ్ల మనోహర్ మానభంగం చేస్తున్నాడని, ఆయన టీడీపీ కోవర్టు అని, అతడి వల్ల జనసేన కార్యకర్తలు పార్టీలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇదే సమయంలో తాను పార్టీ కోసం ఎంత కష్టపడినా సముచిత స్థానం కల్పించలేదని కేతంరెడ్డి ఆరోపించారు.

పార్టీపెట్టి ఇంతకాలం అయినా... ఇంకా జనసేన పార్టీ నిర్మాణంలోనే ఉందని చెప్తున్నారని ఎద్దేవా చేసిన ఆయన... నెల్లూరు సీటిలోని 28లో డివిజన్లలో 28 మంది నాయకును, కేడర్‌ ను తయారు చేసుకున్నానని.. అలాంటిది పార్టీని పదేళ్లలో నిర్మాణం చేసుకోలేకపోవటమేంటని నిలదీశారు. పార్టీలో డమ్మీలకు, పనికిమాలిన వెదవలకూ పెద్ద పెద్ద పదవులు ఇస్తున్నారని ఫైరయ్యారు.

ఈ సందర్భంగా పదవి లేకుండా ఒక్కరోజైనా పని చేయాలని నాదెండ్ల మనోహర్ కు సవాల్ విసిరిన కేతంరెడ్డి... అన్ని పదవులూ నీకు, నీ మనుషులకే కావాలా అంటూ ఫైరయ్యారు. ఎవరైతే బ్రోకర్ పనులు చేస్తుంటారో, ఎవరైతే చాపలు వేస్తుంటారో, ఎవరైతే ఫోన్లు కొనిస్తుంటారో, ఎవరైతే డబ్బులు ఇస్తుంటారో అలాటివాళ్లకు మాత్రం పార్టీలో అగ్రతాంబూలం ఇస్తుంటారని మండిపడ్డారు.

ఇదే సమయంలో జైలుకెళ్లి చంద్రబాబుని కలిశారు, పొత్తు ప్రకటించారు... మరి పార్టీలో మిగిలిన నాయకుల అభిప్రాయాలు తీసుకోరా అని ప్రశ్నించిన కేతంరెడ్డి... ఒంటెద్దుపోకడలకు పోతున్నారని విమర్శించారు. ఈస్ట్ వెస్ట్ లో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో... అక్కడ నుంచి గతంలో జనసేన తరుపున ఎమ్మెల్యేలుగా పోటీచేసిన వారంతా ఇప్పుడు కన్నీరు పెట్టుకుంటున్నారని తెలిపారు.

ఇదే క్రమంలో... నిజంగా జనసేన కోసం కష్టపడేవాళ్లు ఆ పార్టీలో ఉండటం నాదెండ్ల మనోహర్ కు ఏమాత్రం ఇష్టం ఉండదని ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు పార్టీలోనూ, ఇటు బయటా హాట్ టాపిక్ గా మారాయి. పూర్తిగా నాదెండ్ల మనోహర్ లక్ష్యంగా సాగిన కేతంరెడ్డి విమర్శలు జనసేనలో ఎంతమందిని ఆలోచింపచేస్తాయనేది వేచి చూడాలి!