Begin typing your search above and press return to search.

డ్యూటీ ఎక్కిన మనోహర్... రేషన్ పంపిణీ నిలివేత!

అవును.. తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలోని నిల్వ గోదాములను తనిఖీ చేయించారు.

By:  Tupaki Desk   |   16 Jun 2024 10:53 AM GMT
డ్యూటీ ఎక్కిన మనోహర్... రేషన్  పంపిణీ నిలివేత!
X

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగా.. పౌరసరఫరాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాదెండ్ల మనోహర్ డ్యూటీ ఎక్కేశారు. ఇందులో భాగంగా.. రాష్ట్ర, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా సొంత నియోజకవర్గం తెనాలిలో నిల్వ గోదాములను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తెరపైకి వచ్చిన కొన్ని విషయాలపై ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

అవును.. తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలోని నిల్వ గోదాములను తనిఖీ చేయించారు. ఈ క్రమంలో అక్కడ నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు గమనించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... రేషన్‌ లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్‌ వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె.. మొదలైన ప్యాకెట్‌ లలో ఒక్కో ప్యాకెట్ కూ 50-100 గ్రాములు తక్కువ బరువే ఉందని తేలిందని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో తెనాలితో పాటు మంగళగిరిలోనూ తనిఖీ చేయించారు మంత్రి నాదెండ్ల. అయితే... అక్కడ కూడా పరిస్థితి అలానే ఉందని తెలిసిందని తెలుస్తుంది. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని ఆయన ఆదేశించారు. ఇదే సమయంలో వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. అయితే.. ఈ విషయంలో అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తుంది.

ఈ వ్యవహారాలపై మనోహర్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా... రాష్ట్రంలో పౌరసరఫరాలశాఖ ద్వారా పేదలకు ఇచ్చే రేషన్‌ నుంచి అంగన్‌ వాడీ, హాస్టల్స్ కు సరఫరా చేసే నిత్యావసరాల సరులలో భారీ ఎత్తున దోపిడీ జరుగుతోందని.. తూకంతో పాటు ధరల్లోనూ వ్యత్యాసం ఉంటోందని.. ఇదంతా అధికారులకు తెలిసే జరిగిందనే చర్చ మొదలైందని అంటున్నారు.

ఈ క్రమంలోనే పామోలిన్, కందిపప్పు సరఫరాల్లోనే సుమారు రూ.200 కోట్లకు పైగా దోపిడీ జరిగిందని అంటున్నారు. దీంతో... గడిచిన ఐదేళ్లలో పౌరసరఫరాల శాఖలో వందల కోట్ల రూఆపయల కుంభకోణాలు చోటుచేసుకున్నాయని.. వీటన్నింటిపైనా కొత్త ప్రభుత్వం విచారణ చేయిస్తే.. మరెన్నో వాస్తవాలు బయటకొస్తాయని అంటున్నారని తెలుస్తుంది.