తన పోరాటంపై మనోజ్ కీలక వ్యాఖ్యలు.. పోలీసులపై సంచలన ఆరోపణలు!
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్... తన పోరాటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు!
By: Tupaki Desk | 10 Dec 2024 7:51 AM GMTమంచు కుటుంబం వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనకు ప్రాణహాని ఉందని మనోజ్.. మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదులు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్... తన పోరాటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు!
అవును... మంచు కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు.. మనోజ్ కు గాయాలు అయ్యాయని ఆస్పత్రికి రావడం.. మెడికో లీగల్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పడం.. అవి ఎవరో కొడితేనే తగిలిన దెబ్బలనే చర్చ జరగడం.. తనపై దాడి చేశారని మనోజ్ కన్ఫాం చేస్తూ ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... తాను చేసేది ఆత్మగౌరవ పోరాటం అని.. ఇది ఆస్తి కోసమో, డబ్బు కోసమో కాదని.. ఇది తన భార్య, పిల్లల రక్షణకు సంబంధించిన విషయం అని.. తనను అణగదొక్కేందుకు తన భర్యను బెదిరింపులకు గురి చేయడం.. తన ఏడు నెలక పాపను దీనిలోనికి లాగడం.. తన పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదని మంచు మనోజ్ మీడియా ముందు వెళ్లడించారు.
ఇదే సమయంలో... తాను పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరానని.. ఇదే సమయంలో బౌన్సర్లు ఎక్కడ దాక్కున్నరో ఎస్సై కి చూపించానని.. పరిస్థితిని గమనించిన సదరు ఎస్సై.. తనకు రక్షణ కల్పిస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారని.. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి తన బౌన్సర్లను బెదిరించి, పంపించేశారని.. వేరే బౌన్సర్లను మాత్రమే లోపలికి అనుమతించారని ఆరోపించారు.
ఈ సందర్భంగా..."నా ప్రశ్న ఏంటంటే... నేను ఫిర్యాదు చేసిన తర్వాత కేసును డిపార్ట్ మెంట్ ఎందుకు ఇంత పక్షపాతంతో నిర్వహిస్తోంది?" అని మనోజ్ ప్రశ్నించారు. ఈ సమయంలో మీరు డీజీపీని కలవాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు.. "అవసరమైతే తాను ప్రపంచంలోని ప్రతీ ఒక్కరినీ కలుస్తాను" అని మనోజ్ సమాధానం ఇచ్చారు.