Begin typing your search above and press return to search.

ఉద్యమ వేళలోనూ తగలని దెబ్బ కేసీఆర్ కు రెఢీగా ఉందా?

నోటితో చెప్పే నీతులకు.. చేతలతో చేసే పనులకు సంబంధం లేకుండా వ్యవహరించేవారు.

By:  Tupaki Desk   |   13 July 2024 1:00 PM GMT
ఉద్యమ వేళలోనూ తగలని దెబ్బ కేసీఆర్ కు రెఢీగా ఉందా?
X

చేసుకున్నోడికి చేసుకున్న మహదేవ అన్న మాట ఊరికే అనలేదు. గులాబీ బాస్ కేసీఆర్ విషయాన్ని చూస్తే ఇదే నిజమనిపించకమానదు. చేతిలో అధికారం ఉన్న వేళ చెలరేగిపోయిన ఆయన.. తనకు తిరుగులేదని భావించారు. అందుకే.. లెక్కకు మిక్కిలి గీతలు దాటేశారు. నోటితో చెప్పే నీతులకు.. చేతలతో చేసే పనులకు సంబంధం లేకుండా వ్యవహరించేవారు. అదేమని అడిగే ప్రయత్నం చేస్తే కస్సుమనటమే కాదు.. తన చేతిలో ఉన్న 'పవర్' తో కంట్రోల్ చేసే వారు.

రాజకీయ ప్రత్యర్థులు మొదలు కొని ప్రతి ఒక్కరిని పూచిక పుల్ల మాదిరిగా తీసి పారేసేవారు. తనకు మించిన తెలివి మరెవరికీ లేదన్నట్లుగా ఆయన తీరు ఉండేది. కాలం బాగున్నంత కాలం ఎన్ని పనులు చేసినా నడుస్తాయి. కానీ.. కట్లపాము లాంటి కాలం కాటేసే వేళలో.. ఎంతటోడు ఉన్నప్పటికీ ఆగమాగం కావటం మినహా చేసేదేమీ లేదు. తనను తాను అపర మేధావిగా.. అంతకు మించిన రాజకీయ చాణుక్యుడిగా భావించే కేసీఆర్ కు మరో మహా దెబ్బ రెఢీగా ఉందంటున్నారు.

దీనికి రంగం కూడా సిద్ధమైందని చెబుతున్నారు. ఈసారి తగిలే దెబ్బను చూసినోళ్లు ఎవరైనా.. ఎలాంటి కేసీఆర్ కు ఎలాంటి దుస్థితి అనుకోకుండా ఉండలేరని చెబుతున్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా.. అటు లోక్ సభలోనూ.. ఇటు అసెంబ్లీలోనూ ఆయనకు అంతో ఇంతో ప్రాతినిధ్యం ఉండేది. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు రెఢీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క లోక్ సభ స్థానంలోనూ విజయం సాధించని బీఆర్ఎస్ పుణ్యమా అని తెలంగాణ ఉద్యమం షురూ చేసిన తర్వాత మొదటిసారి లోక్ సభలోఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.ఇక.. రాజ్యసభలో నలుగురు గులాబీ ఎంపీలు ఉన్నారు. ఆ నలుగురు సైతం మరికొద్ది రోజుల్లో వేరే పార్టీలోకి వెళ్లిపోవటం ఖాయమంటున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేల్ని ఒకరి తర్వాత ఒకరు చొప్పున హస్తగతం చేసుకుంటున్న వేళ.. రాజ్యసభ ఎంపీలను మాత్రం అధికార బీజేపీలో కలిపేసుకుంటుందని చెబుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఏ రీతిలో అయితే.. రాజ్యసభలో టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనం అయిపోయారో.. ఇప్పుడు అలాంటి సీన్ కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ ను అధికార కాంగ్రెస్ లో విలీనం చేసుకునే ప్రయత్నాలు జోరందుకున్నాయి.

అయితే అసెంబ్లీ సమావేశాలకు కాస్త ముందు కానీ లేదంటే ఈ నెలాఖరులోపు కానీ గులాబీ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసుకోవటం ఖాయమంటున్నారు. ఇంచుమించు ఒకే టైంలో తగిలే ఈ భారీ షాకులు గులాబీ బాస్ కు దారుణ అనుభవాన్ని మిగులుస్తాయని చెబుతున్నారు. ఉద్యమ కాలంలోనూ ఎదురుకాని దెబ్బలు...పదేళ్లు తిరుగులేని రీతిలో పాలన చేసిన తర్వాత తగలటమే అసలుసిసలు అవమానంగా అభివర్ణిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ కు ఎవరో షాకులు ఇవ్వట్లేదని..కాలమే ఇస్తుందన్న మాట పలువురి నోటి నుంచి వస్తోంది.