Begin typing your search above and press return to search.

తాజా ఎన్నికల ఫలితాల వేళ స్టాక్ ట్రేడింగ్ ను ఎలా మేనేజ్ చేయాలంటే?

దీంతో.. మార్కెట్ మాంచి ఊపు మీద ఉంది. అయితే.. ఈ అంచనాలకు భిన్నంగా వచ్చిన ఎన్నికల ఫలితాలు మంగళవారం స్టాక్ మార్కెట్ ను బ్లడ్ బాత్ కు గురి చేశాయి.

By:  Tupaki Desk   |   5 Jun 2024 4:56 AM GMT
తాజా ఎన్నికల ఫలితాల వేళ స్టాక్ ట్రేడింగ్ ను ఎలా మేనేజ్ చేయాలంటే?
X

ముచ్చటగా మూడోసారి ఘన విజయంతో.. అందునా 400 ప్లస్ సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమన్న అంచనాలతో పాటు.. 400 ప్లస్ కాకున్నా.. 370సీట్లను దాటేయటంతో ద్వారా మిత్రుల మీద ఆధారపడకుండానే ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్న ధీమా వ్యక్తమైంది. ఇందుకు తగ్గట్లే వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇదే విషయాన్ని చెప్పాయి.

దీంతో.. మార్కెట్ మాంచి ఊపు మీద ఉంది. అయితే.. ఈ అంచనాలకు భిన్నంగా వచ్చిన ఎన్నికల ఫలితాలు మంగళవారం స్టాక్ మార్కెట్ ను బ్లడ్ బాత్ కు గురి చేశాయి. భారీగా కుంగిన మార్కెట్ తో మదుపురుల సొమ్ము తీవ్రాతి తీవ్రంగా ఆవిరైంది.

తాజా ఫలితాల నేపథ్యంలో మిత్రుల తోడు లేకుండా మోడీ సర్కారు కొలువు తీరని పరిస్థితి. బలంగా ఉండే మోడీ అండ్ కో పదేళ్లలో ఎప్పుడూ లేనంత బలహీనమయ్యారు. మిత్రులతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమే అయినప్పటికీ.. ఊహించని ఈ పరిస్థితి వేళ.. మార్కెట్లు ఎలా రియాక్టు అవుతాయి? గడిచిన కొంతకాలంగా అలవాటు పడిన వాతావరణానికి భిన్నమైన పరిస్థితులు తెర మీదకు రావటంతో ఇప్పుడు ఎలా వ్యవహరించాలన్నది కీలకంగా మారింది.

ఈ నేపథ్యంలో నిపుణుల సలహాలు.. సూచనలు ఎంతో ముఖ్యం. భారీ అంచనాల మధ్య పెద్ద ఎత్తున షేర్లు కొన్న రిటైల్ మదపర్లు ఆశలు నీరు కారాయి. ప్రభుత్వ ఏర్పాటుతో భారీ ర్యాలీ ఖాయమని.. లాభాల పంట పండుతుందన్న అంచనాలకు భిన్నంగా పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడేం చేయాలి? ఏం చేయకూడదన్న విషయాల్లోకి వెళితే..

- కొలువు తీరేది ఎన్డీయే ప్రభుత్వమే కావటంతో మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉండదు. కాకుంటే.. ఒడిదుడుకులు చోటు చేసుకోవటం ఖాయం. దీంతో.. అప్రమత్తంగా ఉండటం.. వ్యూహాత్మకంగా అమ్మకాలు..కొనుగోళ్లు చేపట్టాలి.

- మార్కెట్ సూచీలు పెరుగుతున్నప్పుడు అన్ని షేర్ల ధరలు పెరగవు. కానీ.. సూచీలు పడే వేళలో మాత్రం ఎక్కువ కంపెనీల షేర్లు వేగంగా పతనం అవుతుంటాయి. ఈ విషయాన్ని మదపరులు గుర్తించాలి.

- షేరు వాస్తవ విలువ మీద ఫోకస్ చేయాలి. మార్కెట్ స్థాయి.. భావోద్వేగాల ప్రభావంతో కొన్ని షేర్ల ధరలు పెరిగేటప్పుడు చాలామంది పెట్టుబడులు పెడతారు. ఈ తీరును ఫాలో కాకూడదు.

- ర్యాలీ వేళ ఒక షేరు పెరగటం చూస్తాం. కానీ.. అనూహ్య పరిస్థితుల్లో ఎంత నష్టపోతామనే విషయాన్ని చాలామంది పట్టించుకోరు. మార్కెట్ పడుతున్నప్పుడు షేరు ధర ఇంకా ఎంత పతనం అవుతుందన్న దానిపై ఎక్కువగా ఫోకస్ చేయాలి.

- షేరు వాస్తవిక విలువ కన్నా తక్కువ ధరకు దొరుకుతుందా? షేరు విలువ భవిష్యత్తులో పెరిగే అవకాశాల్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే మదుపు చేయాలి.

- ఇతర పెట్టుబడులతో పోలిస్తే.. దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్ అధిక రాబడి ఇచ్చే వనరు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మార్కెట్ లో చోటు చేసుకునే స్వల్పకాలిక హెచ్చుతగ్గులకు భయపడి.. షేర్లను తెగనమ్ముకోవటం సరికాదు. అలా చేస్తే భారీ నష్టాల పాలవుతారు.

- కొన్ని పరిణామాల కారణంగా వచ్చే నష్టాల నుంచి తప్పించుకోవటానికి దీర్ఘకాలిక పెట్టుబడుల మీద ఫోకస్ చేయటం మంచిది.

- మార్కెట్ పడిపోతున్నప్పుడు కొన్ని ఆకర్షణీయమైన షేర్లు.. మంచి విలువ ఉన్న షేర్లు తక్కువ ధరకు వస్తే కొనుగోలు అవకాశాన్ని వదులుకోవద్దు. కాకుంటే.. లాభాల స్వీకరణకు ఓపికగా వెయిట్ చేసేలా ఉంటేనే మదుపు చేయటం ఉత్తమం.

- మదుపు చేయాల్సిన పెట్టుబడి మొత్తాన్ని ఒకేసారి కాకుండా నాలుగైదు ధఫాలుగా పెట్టటం ద్వారా రిస్కును తగ్గించుకునే వీలుంది.