మార్క్ జుకర్ బర్గ్.. వేల కోట్ల ఖర్చుతో భూగర్భ బంకర్ అందుకేనా?
వివరాల్లోకి వెళ్తే మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, అతని భార్య ప్రిసిల్లా చాన్ తమ కోసం భూగర్భ బంకర్ ను నిర్మించాలని తలపెట్టారు
By: Tupaki Desk | 3 Jan 2024 5:29 AM GMTఫేస్ బుక్, ఇనస్ట్రాగామ్ సంస్థల అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఏం చేసినా సంచలనమే. 30 ఏళ్ల వయసులోపే ఆయన ఫేస్ బుక్ ను బిలియన్ డాలర్ల సంస్థగా నిలిపారు. అంతేకాకుండా అత్యధిక ధనవంతుల జాబితాలోనూ నిలిచారు. ఇక ఇనస్ట్రాగామ్ ద్వారా జుకర్ బర్గ్ మరిన్ని సంచనాలకు తెరతీశారు.
తాజాగా మార్క్ జుకర్ బర్గ్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఆయన భూగర్భ బంకర్ ను నిర్మిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వివరాల్లోకి వెళ్తే మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, అతని భార్య ప్రిసిల్లా చాన్ తమ కోసం భూగర్భ బంకర్ ను నిర్మించాలని తలపెట్టారు. ఇందుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. భారత కరెన్సీలో 2,249 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో దీన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ 5 వేల చదరపు అడుగుల బంకర్ ను అమెరికాలోని హవాయిలో ఉన్న జుకర్ బర్గ్ 1400 ఎకరాల పొలంలో నిర్మిస్తున్నారు.
కాగా ఈ బంకర్ కి బయట ప్రపంచం నుంచి అవసరం ఏమీ ఉండదని అంటున్నారు. దానంతట అదిగా సొంత శక్తిని సమకూర్చుకునేలా నిర్మిస్తున్నారు. బంకర్ గేట్ ఒక లోహంతో, కాంక్రీటుతో నింప బడి ఉంటుందని అంటున్నారు. సాధారణంగా ఇలాంటి బంకర్లను క్షిపణి దాడులు, అణు వార్ హెడ్లు, శక్తివంతమైన బాంబుదాడులు, తీవ్రమైన తుపానుల నుంచి తప్పించుకోవడానికి వాడతారని పేర్కొంటున్నారు.
కాగా ఈ బంకర్ ను మార్క్ జుకర్ బర్గ్ ఎందుకు నిర్మిస్తున్నారో.. దీనికి వేల కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు పెడుతున్నారో ఇంతవరకు ఆయన కానీ, ఆయన కంపెనీల తరఫున మరెవరైనా కానీ చెప్పలేదు.
కాగా ఈ బంకర్ లో అండర్ గ్రౌండ్ షెల్టర్ ఉంటుంది. బంకరులోనే డజనుకు పైగా భవనాలు నిర్మిస్తున్నారు. ఇందులో పనిచేసేవారు ఇక్కడే నివాసం ఉంటారు. బంకర్ లో ఏకంగా 30 బెడ్ రూమ్‌లు, 30 బాత్ రూమ్‌లు ఉంటాయి. ఇవి కాకుండా రెండు బంగ్లాలను కూడా నిర్మించారు. ఈ బంకర్ కు చెందిన బ్లూ ప్రింట్‌లో 11 ట్రీ హౌస్‌లు, ఫిట్‌నెస్ సెంటర్, గెస్ట్ హౌస్, అనేక ఇతర నిర్మాణాలు ఉండటం విశేషం.
కాగా ఇలాంటి బంకర్ల నిర్మాణానికి గతంలో పలువురు ముందుకొచ్చారు. ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ పీటర్ థీల్ కూడా గతేడాది బంకర్ ను నిర్మించుకోవాలని అనుకోగా.. స్థానిక కౌన్సిల్ ఆ ప్లాన్ ను అంగీకరించలేదు. బంకర్ నిర్మాణంతో చుట్టుపక్కల పర్యావరణం దెబ్బతింటుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే అమెరికా ధనవంతుల్లో ఒకరిగా ఉన్న డూమ్‌డే కూడా మార్క్ జుకర్ బర్గ్ లాగే బంకరును నిర్మించారు.