అంబానీ పెళ్లిలో బిల్‌గేట్స్ - మార్క్ జుకర్‌బర్గ్ దేశీ లుక్స్
క్యాజువల్ లుక్ లో కనిపించిన ఇద్దరు అంతర్జాతీయ సిలికాన్ వ్యాలీ మొగల్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
By: Tupaki Desk | 3 March 2024 7:01 AM GMTఅనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన ఫేస్‌బుక్ CEO మార్క్ జుకర్‌బర్గ్ - మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ జామ్‌నగర్‌లో కలుసుకున్నారు. క్యాజువల్ లుక్ లో కనిపించిన ఇద్దరు అంతర్జాతీయ సిలికాన్ వ్యాలీ మొగల్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దాదాపు 1200 మంది అతిథుల జాబితాలో గేట్స్ - జుకర్‌బర్గ్‌తో పాటు, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ తదితర ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిల్ గేట్స్ భారతీయులకు అత్యంత ఆప్తుడు. అతడు మిలియన్ల డాలర్లను భారతదేశంలో పేదల ఆరోగ్యం కోసం విరాళాలుగా ఇచ్చారు. ఇక ఫేస్ బుక్ అధినేతకు ఇక్కడ భారీ ఫాలోవర్స్ ఉన్నారు. భారతదేశం సహా ఆఫ్రికాలోని చాలామంది పేదల ఉన్నత చదువుల కోసం ఫేస్ బుక్ అధినేత విరాళాలు సామాజిక కార్యక్రమాలు అప్పట్లో చర్చకు వచ్చాయి. అలాంటి ఇరువురు దిగ్గజాలు రిలయన్స్ అంబానీల పెళ్లిలో సందడి చేయడం అభిమానులకు కన్నుల పండుగగా మారింది.
హాలీవుడ్ సెలబ్ రిహన్నతో పాటు బి-టౌన్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అనిల్ కపూర్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, అలియా భట్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్, కియారా అద్వానీ, అనన్య పాండే, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎం.ఎస్.ధోనీ, రోహిత్ శర్మ కూడా హాజరయ్యారు. టాలీవుడ్ స్టార్లు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ వేడుకలో సందడి చేసారు.
గుజరాత్‌లో అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలు మూడో రోజు అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ మూడు రోజుల వేడుకలో విందు కోసం దాదాపు 100 మంది చెఫ్‌లు తయారు చేసిన 500 వంటకాలను అతిథులకు అందిస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ బాష్ 1వ రోజు సింగర్ రిహన్నా అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శనతో ప్రారంభమైంది. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మరియు అమీర్ ఖాన్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ముందుగా ప్రదర్శన ఇచ్చారు.
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చైర్‌పర్సన్ నీతా అంబానీ మాట్లాడుతూ తమ మూలాలు ఉన్న గుజరాత్ జామ్ నగర్ లో ఈ వేడుక జరుపుకోవాలని భావించినట్టు తెలిపారు. అంబానీ కుటుంబం జామ్ నగర్ సమీపంలోని గ్రామాలలో నివసిస్తున్న 51,000 మంది ప్రజల కోసం గొప్ప విందును ఏర్పాటు చేయడం మరో హైలైట్.