Begin typing your search above and press return to search.

పెళ్ళైన హీరోయిన్లకే ఇక్కడ ఫుల్ డిమాండ్!

ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే, వివాహ బంధంలో అడుగుపెట్టిన తర్వాత అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి.

By:  Tupaki Desk   |   9 Oct 2024 3:56 AM GMT
పెళ్ళైన హీరోయిన్లకే ఇక్కడ ఫుల్ డిమాండ్!
X

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో పెళ్ళైన హీరోయిన్లకు డిమాండ్ కాస్త తగ్గుతుంది. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే, వివాహ బంధంలో అడుగుపెట్టిన తర్వాత అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. దీంతో కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. సెకెండ్ ఇన్నింగ్స్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా మారి అక్క వదిన పాత్రలతో సరిపెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కొందరు కథానాయికలు పెళ్ళి తర్వాత కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు. మునుపటి కంటే ఎక్కువ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. కుర్ర భామలకు పోటీనిస్తూ టాప్ లో దూసుకుపోతున్నారు. ఓవైపు వైవాహిక జీవితాన్ని మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ, సినీ కెరీర్‌ కు పెళ్లి అడ్డంకి కాద‌ని నిరూపిస్తున్నారు. వారిలో తల్లై పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్న హీరోయిన్లు కూడా ఉండటం గమనార్హం.

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ను తీసుకుంటే, హీరో రణబీర్ కపూర్ ను పెళ్ళి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా హీరోయిన్ గా రాణిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'జిగ్రా' సినిమా విడుదలకు సిద్ధమైంది. దసరా స్పెషల్ గా అక్టోబర్ 11న థియేటర్లలోకి రాబోతోంది. టాలీవుడ్ హీరో రానా దగ్గుపాటి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఇక యశ్ రాజ్ ఫిలింస్ లో 'ఆల్ఫా' అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ లో ఆలియా నటిస్తోంది.

కరీనా కపూర్ ఖాన్ సైతం పెళ్ళి తర్వాత అదరగొడుతోంది. ఇద్దరు పిల్లలకు తల్లయినా ఇప్పటికీ లీడ్ రోల్స్ లో నటించే ఛాన్స్ లు అందుకుంటోంది. ఈ ఏడాదిలో క్రూ, ది బకింగ్‌హామ్ మర్డర్స్ చిత్రాలలో అలరించిన కరీనా.. ఇప్పుడు 'సింగం ఎగైన్' సినిమాతో పలకరించబోతోంది. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ కు జోడీగా నటిస్తోంది. లేటెస్టుగా వచ్చిన ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ నవంబర్ 1న విడుదల కానుంది.

మరో బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకునే సైతం పెళ్ళి తర్వాత స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సంవత్సరం 'ఫైటర్', 'కల్కి 2898 AD' సినిమాలతో విజయాలు సాధించింది. దీపావళి సందర్భంగా 'సింగం ఎగైన్' చిత్రంతో అలరించబోతోంది. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా సినిమాలకు కాస్త విరామం ఇవ్వనుంది. పెళ్లి చేసుకున్నా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తోంది. అలానే యశ్ తో 'టాక్సిక్' మూవీ, హిందీలో 'వార్ 2' చిత్రాల్లో నటిస్తోంది.

సౌత్ విషయానికొస్తే, లేడీ సూపర్ స్టార్ నయనతార మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా తన హవా కొనసాగిస్తోంది. ఓవైపు గ్లామర్ రోల్స్ లో నటిస్తూనే, మరోవైపు కంటెంట్ ఓరియంటెడ్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. ఆమె చేతిలో ప్రస్తుతం టెస్ట్, మన్నంగట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, తని వరువన్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ, మూకుతి అమ్మన్ 2, టాక్సిక్, NT 81 వంటి సినిమాలు ఉన్నాయి. విడాకుల తర్వాత సమంత రూత్ ప్రభు వరుస ప్రాజెక్ట్స్ సైన్ చేసింది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి మరికొందరు హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా మంచి ఆఫర్లు అందుకుంటూ స్టార్స్ గా వెలుగొందుతున్నారు.