ఫ్యామిలీ ప్యాకేజ్... వధువుగా వివాహిత ఘరానా మోసం!
ఈ మధ్యకాలంలో మోసాలు మరీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 Aug 2023 6:29 AM GMTఈ మధ్యకాలంలో మోసాలు మరీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. పైగా మహిళలు పలు చోట్ల హనీ ట్రాప్ లకు పాల్పడుతుంటే... మరికొంతమంది పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బు గుంచి మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మ్యాట్రిమొనీ సైట్లో పరిచయమైన ఒక మహిళ... పెళ్లికి "ఎస్" చెప్పి మోసానికి పాల్పడిన వ్యవహరం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఫ్యామీలీ ప్యాకేజ్ ట్విస్ట్ కావడం గమనార్హం.
అవును... అప్పటికే పెళ్లిన ఒక మహిళ మ్యాట్రిమొనీ సైట్లో ప్రొఫైల్ అప్ లోడ్ చేసింది. ఈ సమయంలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని ఫోన్ నెంబర్ తీసుకున్న ఆ మహిళ... వీడియో కాల్ చేసి పరిచయం పెంచుకుంది. ఈమె నచ్చడంతో ఆ వ్యక్తి కూడా పెళ్లికి "ఎస్" చెప్పాడు. అక్కడ నుంచి రోజూ ఫోన్లు, చాటింగులతో వ్యవహారం నడించింది. లాస్ట్ లో ఆమె వివాహిత అని, భర్త పిల్లలు ఉన్నారని తెలిసి షాకవ్వడం సదరు వ్యక్తి వంతైంది.
వివరాళ్లోకి వెళ్తే... భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్న ఒక వివాహిత... మ్యాట్రిమొనీ సైట్ లో ఒక యువకుడికి వదువుగా పరిచయమైంది. నిజామాబాద్ జిల్లా బోధన్ కి చెందిన ఆ యువకుడికి తాను వైజాగ్ కి చెందిన అమ్మాయిగా పరిచయం చేసుకుంది. ఇద్దరూ ఒకరికి ఒకరు నచ్చడంంతో ఆమెతో పెళ్లికి అంగీకరించాడు ఆ యువకుడు.
ఇద్దరి మధ్యా ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ నడుస్తున్నాయి. ఈ సమయంలో ఒక సారి తనకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పిన మహిళ.. తాను హాస్పటల్ లో ఉన్నానని, డబ్బులు కావాలని అడిగింది. దీంతో... కాబోయే భార్యే కదా అనుకున్నాడో ఏమో కానీ... డబ్బులు పంపించాడు. ఇలా ఏడాది కాలంలో సుమారు 4 లక్షల రూపాయల వరకూ ఆమెకు పంపించాడు.
ఇలా సుమారు ఏడాది కాలం గడిచిపోయింది.. ఇప్పటికే నాలుగు లక్షలు ఖర్చు అయిపోవడంతో... పెళ్లికి ఆ యువకుడు ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆమె ఇతడి నెంబర్ ని బ్లాక్ లో పెట్టింది. దీంతో అనుమానం వచ్చి ఆరాతీయగా... ఆమె వివాహిత అని, ఇద్దరు కూతుళ్లు, భర్త ఉన్నట్లు తేలింది.
దీంతో యువకుడు ఆమెను నిలదీయగా.. అతడిని బెదిరిస్తూ ఆమె ఎదురుదాడికి దిగింది. దీంతో కంగుతిన్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా జరిపిన పోలీసు విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆ విషయాలు తెలుసుకుని విస్తుపోవడం ఈ యువకుడి వంతైంది.
ఈ యువకుడిని మోసం చేసే విషయంలో... ఆమెతో పాటు ఆమె భర్త, ఇద్దరు కూతుళ్లు కలిసే ఈ పనికి పాల్పడినట్లు తేలింది. అప్పుడప్పుడు ఆమె స్నేహితురాళ్లుగా యువకుడితో ఆమె కూతుళ్లే మాట్లాడినట్లు తెలిసింది. దీంతో... ఆమె కుటుంబమే పక్కా ప్లాన్ తో ఈ మోసానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తేలినట్లు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.