Begin typing your search above and press return to search.

10 కాదు.. 12 నుంచి 15 కోట్లు... కుంభమేళాలో షాకింగ్ గా ట్రాఫిక్ జామ్!

జీవితకాలంలో ఒక్కసారే వచ్చే మహా కుంభమేళా కోసం కోటానుకోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు పోటెత్తుతున్నారు. ప్రధానంగా 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే పండుగ కావడంతో తివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Jan 2025 11:12 AM IST
10 కాదు.. 12 నుంచి 15 కోట్లు... కుంభమేళాలో షాకింగ్ గా ట్రాఫిక్ జామ్!
X

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో ‘మౌనీ అమావాస్య’ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున యూపీ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది! జనవరి 13న నుంచి ఈ మహా కుంభమేళాలో ఇప్పటివరకూ సుమారు 15 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు చెబుతుండగా.. బుధవారం ఒక్కరోజే 10 కోట్లమంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో... త్రివేణీసంగమ ప్రాంతాన్ని కొన్ని రోజుల పాటు "నో వెహికల్ జోన్"గా ప్రకటించారు. మరోపక్క 1 - 8 తరగతుల స్థానిక విద్యార్థులకు 28 నుంచి 30 తేదీవరకూ సెలవులు ప్రకటించారు. అలహాబాద్ హైకోర్టు సైతం బుధవారం సెలవుగా ప్రకటించింది. అయితే... అధికారుల అంచనలాకు మించి భక్తులు తరలివచ్చారని అంటున్నారు.

అవును... జీవితకాలంలో ఒక్కసారే వచ్చే మహా కుంభమేళా కోసం కోటానుకోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు పోటెత్తుతున్నారు. ప్రధానంగా 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే పండుగ కావడంతో తివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వస్తున్నారు. ఈ సమయంలో బుధవారం ఒక్కరోజే 12 నుంచి 15 కోట్ల మంది భక్తులు తరలి రావొచ్చని అంటున్నారు.

మౌనీ అమావాస్య కావడంతో బుధవారం 10 కోట్ల మంది వరకూ తరలివస్తారని తొలుత అధికారులు అంచనా వేయగా.. ఏకంగా 15 కోట్ల వరకూ రానున్నరని తెలియడంతో.. ఏర్పాట్లు, తొక్కిసలాట మొదలైన విషయాలపై ఆందోళన నెలకొందని అంటున్నారు. మరోపక్క.. రాజ్ ప్రయాగ్ లో సుమారు 47 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు చెబుతున్నారు.

ఈ సమయంలో భక్తులకు అధికారులు కొన్ని ప్రత్యేక సూచనలు జారీ చేశారు. భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా... నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్ లకు వెళ్లాలని, స్నానాల తర్వాత గుమిగూడి ఎక్కువసేపు ఉండొద్దని విజ్ఞప్తి చేశారు.

మరోపక్క... మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా విపరీతమైన రద్దీ నెలకొనడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో... ఈ తొక్కిసలాటలో కనీసం 20 మంది మృతిచెందినట్లు తెలుస్తోండగా.. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ సమయంలో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు!