Begin typing your search above and press return to search.

మస్తాన్ సాయి కేసు: పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటకు?

పోలీసుల విచారణలో హార్డ్ డిస్క్‌లో 2500కు పైగా ఫోటోలు, 505కు పైగా వీడియోలు, 734 ఆడియో రికార్డింగ్స్ ఉన్నట్టు గుర్తించారు.

By:  Tupaki Desk   |   22 Feb 2025 5:42 PM GMT
మస్తాన్ సాయి కేసు: పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటకు?
X

నగ్న వీడియోలు, డ్రగ్స్ పార్టీల కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. మస్తాన్ సాయిని మూడు రోజుల పాటు పోలీసులు విచారించగా, హార్డ్ డిస్క్, డ్రగ్స్, పార్టీస్, సాఫ్ట్‌వేర్ అన్నింటి గురించి ప్రశ్నించారు. అయితే డ్రగ్స్ సంబంధిత ప్రశ్నలకు మస్తాన్ సాయి సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి? ఎవరికెవరికి డ్రగ్స్ ఇచ్చారు? వంటి ప్రశ్నలకు అతను నోరు మెదపలేదు. కానీ, హార్డ్ డిస్క్‌లో ఉన్న డేటా గురించి వివరాలు పోలీసులకు అందించాడు.

- హార్డ్ డిస్క్‌లో ఏమున్నాయి?

మస్తాన్ సాయి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్‌ను పోలీసులు పరిశీలించగా, మొత్తం 17 ఫోల్డర్లు ఉన్నట్టు గుర్తించారు. వాటిలో ఆరుగురు అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వీడియోలలో ఎక్కువగా వాట్సాప్ వీడియో కాల్ స్క్రీన్ రికార్డింగ్స్ ఉన్నాయని వెల్లడైంది. ముఖ్యంగా లావణ్యతో పాటు మస్తాన్ గర్ల్‌ఫ్రెండ్స్, అతని భార్యకు సంబంధించిన వీడియోలు గుర్తించారు. కొన్ని వీడియోలు నార్మల్‌గా ఉండగా, మరికొన్ని పూర్తిగా ప్రైవేట్ వీడియోలుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

- ఫోటోలు, ఆడియోలు, వీడియోలు - మొత్తం ఎంత?

పోలీసుల విచారణలో హార్డ్ డిస్క్‌లో 2500కు పైగా ఫోటోలు, 505కు పైగా వీడియోలు, 734 ఆడియో రికార్డింగ్స్ ఉన్నట్టు గుర్తించారు. వీటిలో ఎక్కువగా లావణ్యకు సంబంధించిన ఫైళ్లు ఉన్నట్టు తేలింది. మస్తాన్ సాయి, లావణ్య ప్రైవేట్ వీడియోలు వారు తెలియకుండా రికార్డ్ చేసినట్టు అతను ఒప్పుకున్నాడు.

-ఫోన్ హ్యాక్ సాఫ్ట్‌వేర్ - కొత్త కోణం

మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో "పోడ్‌కాస్ట్" అనే ఫోల్డర్‌ను పరిశీలించగా, అందులో ఫోన్ హ్యాక్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను పోలీసులు గుర్తించారు. ఇది మరింత ఆసక్తికరంగా మారింది. లావణ్య ఫోన్ నుండి 734 ఆడియో కాల్ రికార్డింగ్స్ క్విక్ షేర్ ద్వారా మస్తాన్ సాయికి చేరినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

-పోలీసుల తదుపరి చర్యలు

మస్తాన్ సాయి నుంచి డ్రగ్స్ రాకపోకలపై మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హార్డ్ డిస్క్‌లోని సమాచారం ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక నాడు మస్తాన్ సాయి నుండి లభించిన డేటా ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

మొత్తంగా ఈ కేసు టాలీవుడ్ , సాఫ్ట్‌వేర్ రంగాలను కూడా తాకేలా ఉండడంతో, విచారణ పురోగతి ఉత్కంఠగా మారింది.