మంతెన సత్యనారాయణ ఆశ్రమం మునిగితే చంద్రబాబు మునగడా ?
ఇవన్నీ పక్కన పెడితే ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరద నీట మునిగింది అని కూడా వార్తలు వచ్చాయి.
By: Tupaki Desk | 13 Sep 2024 3:45 AM GMTఇటీవల వచ్చిన భారీ వానలు వరదలలో కృష్ణా నది కరకట్ట మీద ఉన్న ఇళ్ళూ ఇతర నిర్మాణాలూ అన్నీ నీట మునిగాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అందులో చంద్రబాబు ఉండవల్లిలో నివాసం ఉంటున్న ఇల్లు కూడా మునిగింది అని కూడా చెప్పుకున్నారు. దీని మీద కొన్ని విజువల్స్ కూడా వచ్చాయి.
ఇవన్నీ పక్కన పెడితే ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరద నీట మునిగింది అని కూడా వార్తలు వచ్చాయి. మరి రాజు గారి ఆశ్రమానికి వచ్చిన నీళ్ళు ఉండవల్లిలోని బాబు గారి ఇంటికి తాకకుండా పక్కకు పోయాయా అని సెటైర్లు కూడా పడ్డాయి.
ఈ నేపథ్యంలో నుంచి చూసినపుడు అసలు బాబు గారి ఇల్లు మునగ లేదు అంటూ వచ్చిన వారు కాస్తా అమరావతి నీట మునగ లేదు అని కూడా పెద్ద ఎత్తున రివర్స్ లో ప్రచారం మొదలెట్టారు. టీడీపీ వాళ్ళు, చంద్రబాబుతో పాటు పచ్చ చానళ్ళు అయితే అదే ప్రచారంగా చేశారు.
అసలు అమరావతికి ఏమీ కాలేదని బాబు గారు కానీ పచ్చ చానళ్ళు కానీ ఎంత ప్రచారం హోరెత్తించినా బయట ప్రపంచానికి అసలు నిజాలు తెలుసు అని అంటున్నారు. ఇంత పెద్ద వరదలు జీవితంలో చూడలేదని టీడీపీ వాళ్ళూ అంటున్నారు. కానీ ఈ స్థాయిలో వచ్చిన వరదలు రానున్న రోజులలో మరింతగా స్కోర్ పెంచుకుని వస్తాయి కానీ తగ్గవు కదా అన్నది పర్యావరణం నిపుణుల మాట.
ఈ నేపథ్యంలో అమరావతి రాజధానిగా ఎంతవరకూ సేఫ్ అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.బయటకు అమరావతికి గట్టిగా మద్దతు ఇస్తూ వస్తున్నా తెలుగుదేశం పార్టీలోనూ దీని మీద సీరియస్ గానే డిబేట్ సాగుతోంది అని అంటున్నారు. ఇక మీదట అమరావతి విషయంలో పాజిటివ్ ఒపీనియన్ తో ఉండడం కరెక్ట్ కాదేమో అన్న మాట కూడా తమ్ముళ్ళ మధ్య చర్చకు వస్తోంది అని అంటున్నారు.
చంద్రబాబు ఇంటి మీదకు వరద నీరు రాలేదని అలా చూపించలేదని అంటున్న టీడీపీ వారు కూడా ఇపుడు మరో విషయం కూడా మాట్లాడుకుంటున్నారుట. ఈ నేపథ్యంలో ఇపుడు ఒక విషయం బయటకు వస్తోందిట. అదేంటి అంటే మంతెన సత్యనారాయణ రాజు ఇల్లు మునిగింది అన్నది అందరికీ తెలుసు. దాని మీద అయితే వీడియోలే బయటకు వచ్చాయి. సరిగ్గా ఇక్కడే లాజిక్ పాయింట్ ఒకటి తమ్ముళ్ళను పట్టి పీడిస్తోందిట. మంతెన రాజు గారి ఆశ్రమానికి పొంగి పొర్లిన వరద నీరు అదే లైన్ లో ఉన్న చంద్రబాబు ఇంటికి రాకుండా ఆగిపోతాయా అన్నదే తర్కానికి అందీ అందని ప్రశ్నగా ఉందిట.
నిజంగా వానలు వచ్చినపుడు వరదలు వచ్చినపుడు నీరు ఇళ్లలోని వస్తుంది. అది ఓపెన్ గా చెప్పినా లేక జరిగింది అని చూపించినా ఒప్పుగా ఉండేది. కానీ అసలు వరద నీరు రానే లేదని చెప్పడం పైగా అదంతా విష ప్రచారంగా కొట్టిపారేయడం తోనే లెక్కలేనన్ని కొత్త డౌట్లు వచ్చాయని కూడా టీడీపీలోనే అనుకుంటున్నారని టాక్.
ఈసారి వచ్చింది అతి పెద్ద వరద అంతా నీట మునిగాయి. అలాంటిది బాబు గారి ఇంటికి ఏమీ కాలేదని చెబుతూ అదే నిజమని నమ్మిస్తూ దాని మీదనే ఫోకస్ చేయడమే రాంగ్ స్ట్రాటజీ అని కూడా అనుకుంటున్నారుట. అసలు ఇలాంటి విషయాలే కరెక్ట్ కాదు అన్నట్లుగా కూడా టీడీపీలో డిస్కషన్ సాగుతోంది అంటున్నారు.
నిజం చెప్పాలంటే అమరావతి రక్షణ కోసం వేసిన పరదా ఇది అని అంటున్న వారూ ఉన్నారు. ఎక్కడ బాబు ఇల్లు నీట మునిగింది అని వార్తలు వస్తే అది జాతీయ స్థాయిలోనే హైలెట్ అవుతుందని తద్వారా అమరావతి రాజధాని పరిసరాల విషయం కూడా వెలుగు చూసి ఎక్కువగా ఫోకస్ అవుతుందని ఆలోచించే ఈ రివర్స్ ప్రచారానికి తెర తీశారు అని అంటున్నారు.
నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అంటారు. ఇపుడు చూస్తే వరద నీరు పల్లమెరుగు అని పల్లం భూములను ముంచేసింది. అదే ఇపుడు నిజం కూడా చెప్పేసింది అని అంటున్నారు. వాస్తవానికి అమరావతి రాజధాని విషయంలో ఎంత కవరింగ్ చేసినా సత్యం దాగేది కాదనే అంటున్నారు. అది ముక్కారు పంటలు పండే భూముల ప్రాంతం అని సింకింగ్ సాయిల్ అన్నది అందరికీ తెలిసిందే అంటున్నారు. అలాగే కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలకు వరద ముప్పు ఎపుడూ ఉంటుందని కూడా అందరికీ తెలుసు అంటున్నారు.
మొత్తానికి ఏదో చేద్దామని ఏదో విధంగా ఇష్యూని డైవర్ట్ చేద్దామని చూసినా కూడా ఇపుడు అదే వెలుగు చూసేలా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా లాజిక్ కి అందని వాటిని ఎంత ఊదరగొట్టినా ఆలస్యంగా అయినా బయటకు వస్తాయన్న సెటైర్లు పడుతున్నాయి.