ఏమిటి రాజా ఇది?... నిమిషానికి లక్షా 40 వేల కోళ్లు!
ప్రపంచ వ్యాప్తంగా శాఖాహారం తినేవారు పెరుగుతున్నారని.. నాన్ వెజ్ వినియోగం తగ్గుంతుందని చాలామంది భావిస్తుంటారని అంటుంటారు
By: Tupaki Desk | 23 Jan 2024 4:01 AM GMTప్రపంచ వ్యాప్తంగా శాఖాహారం తినేవారు పెరుగుతున్నారని.. నాన్ వెజ్ వినియోగం తగ్గుంతుందని చాలామంది భావిస్తుంటారని అంటుంటారు. అయితే అదేమీలేదు.. మాంసాహారం తినడం మొదలుపెడితే తమకంటే బాగా ఎవరూ తినలేరని మనిషి చెబుతున్నాడు!! ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగంపై ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి.
ప్రపంచ వ్యాప్తంగా మాంసాహార ప్రియులు ఏయే జంతువులు, ఏయే పక్షులు, ఏయే సముద్ర జీవులను ఎక్కువగా తింటున్నారనే విషయం లెక్కలతో సహా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్హంగా షాకింగ్ విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రతీ ఏడాదీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10వేల కోట్ల జంతువులను మనిషి లాగించేస్తున్నాండట! ఈ లెక్కలకు సంబంధించిన ఒక యానిమేటెడ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
అవును... ప్రపంచవ్యాప్తంగా మనిషి ఆరగించేస్తున్న వాటిలో కోళ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 205 మిలియన్ల కోళ్లను తినేస్తున్నారని తాజా ఘణాంకాలు చెబుతున్నాయి. అంటే... ప్రతీ నిమిషానికి లక్షా 40వేలకు పైగా కోళ్లు మానవులకు ఆహారంగా మారిపోతున్నాయన్నమాట. ప్రపంచ వ్యాప్తంగా పంది మాంసాన్ని ఇప్పుడు కోడి డామినేట్ చేసిందని చెబుతున్నారు!
తాజాగ వెలువడిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యు.ఇ.ఎఫ్) నివేదిక ప్రకారం అత్యంత ప్రజాదరణ పొందిన రెడ్ మీట్, బీఫ్ మాంసం వినియోగం గత 50 ఏళ్లలో దాదాపు సగానికి పడిపోయి 22 శాతానికి చేరిందని చెబుతున్నారు. అయితే... ఇప్పటికీ గొర్రె మాంసం కంటే దీని వినియోగం దాదాపు ఐదు రెట్లు ఎక్కువగానే ఉండటం గమనార్హం.
ఇక మాంసాహారానికి ఎక్కువగా డిమాండ్ ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో చైనా నిలవగా... ఐరోపా, ఉత్తర అమెరికాల్లో మాత్రం గతంతో పోలిస్తే వినియోగం నియంత్రణలో ఉందని, మరికొన్ని ప్రాంతాల్లో బాగా తగ్గిందని చెబుతున్నారు. అయితే... జనాభా విషయంలో చైనాను వెనక్కి నెట్టిన భారత్ మాత్రం మాంసం వినియోగంలో వెనుకబడే ఉందని తెలుస్తుంది!!