Begin typing your search above and press return to search.

'జై' కొట్ట‌క‌పోతే.. స‌భ నుంచి వెళ్లిపోండి..: ఫైర్ బ్రాండ్ కేంద్ర మంత్రి ఫైర్‌

పైన చెప్పుకొన్నాం క‌దా.. ఆమె మాట్లాడితే..నిప్పులు కుర‌వాల్సిందే. ఆమె చెప్పిన‌ట్టు చేయాల్సిందే. ఇక్క‌డ కూడా ఆమె అలానే చేశారు. ''జై'' కొట్టండి అని అన్నారు.

By:  Tupaki Desk   |   4 Feb 2024 12:30 PM GMT
జై కొట్ట‌క‌పోతే.. స‌భ నుంచి వెళ్లిపోండి..:  ఫైర్ బ్రాండ్ కేంద్ర మంత్రి ఫైర్‌
X

ఆమె క‌దిలితే.. పొలిటిక‌ల్ సెగ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఆమె నోరు విప్పితే ప్ర‌తి మాట‌లోనూ జ‌ల‌జ‌లా నిప్పులు కురుస్తాయి. కానీ, ఆమె కేంద్ర మంత్రి. పైగా హై ప్రొఫైల్ నాయ‌కురాలు. దీంతో ఏం చేస్తాం.. అని సొంత పార్టీ నాయ‌కులే స‌ర్దుకుపోతున్నారు. ఆమే.. మీనాక్షి లేఖి. ప్ర‌స్తుతం ఆమె మోడీ ప్ర‌భుత్వంలో ఆమె స‌హాయ మంత్రిగా ఉన్నారు. తేడా అని అనిపిస్తే.. సొంత నేత‌ల‌పైనే ఆమె నిప్పులు చెరుగుతారు. ఫైర్ బ్రాండ్ ఉమాభార‌తి గురించి తెలిస్తే.. మీనాక్షి గురించి త్వ‌ర‌గా అర్ధ‌మ‌వుతుంది. ఎందుకంటే.. ఆమె శిష్యురాలే ఈమె. కాక‌పోతే.. ఈమెకు వివాహం అయింది.. ఒక కుమారుడు కూడా ఉన్నారు. అంతే తేడా!

స‌రే.. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. తానుపాల్గొన్న స‌భ‌లో తాను చెప్పిన మాట‌కు 'జై' కొట్ట‌క‌పోతే.. నాయ‌కులు ఎవ‌రూ కూడా.. స‌భ‌కు వ‌చ్చిన‌వారిని బెదిరించిన సంద‌ర్భాలు లేవు. పైగా కేంద్రంలో మంత్రులుగా ఉన్న‌వారు..అయితే మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఎందుకంటే.. అడిగి మ‌రీ జై కొట్టించుకునే సంస్కృతి ఇంకా పెద్ద‌గా రాలేదు. పైగా మ‌న‌ది నియంతృత్వం అంత‌క‌న్నాకాదు. సో.. నాయ‌కులు ఏదైనా సంద‌ర్భోచితంగా చెబితే.. దానికి న‌చ్చిన‌వారు.. జై కొడ‌తారు..లేనివారు మౌనంగా ఉంటారు. ఇది కామ‌న్‌. కానీ, మ‌న ఫైర్ బ్రాండ్ కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి లైన్ ఇది కాదు.

పైన చెప్పుకొన్నాం క‌దా.. ఆమె మాట్లాడితే..నిప్పులు కుర‌వాల్సిందే. ఆమె చెప్పిన‌ట్టు చేయాల్సిందే. ఇక్క‌డ కూడా ఆమె అలానే చేశారు. ''జై'' కొట్టండి అని అన్నారు. కానీ, స‌భ‌కు వ‌చ్చిన వారిలో మేడ‌మ్ లేఖి మాట‌ల‌ను స‌రిగా విన్నారో లేదో తెలియ‌దు కానీ.. ఓ మ‌హిళ మాత్రం జై కొట్ట‌లేదు. దీంతో ఆమె నిండు స‌భ‌లో నిల‌బెట్టి.. నానా తిట్లు తిట్టేసి బ‌య‌ట‌కు గెంటేశారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న తీవ్ర వివాదానికిదారి తీయ‌డం గ‌మ‌నార్హం. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రంపై నిప్పులు చెరుగుతోంది. మ‌హిళా క‌మిష‌న్ కూడా మంత్రి చేష్ట‌ల‌ను త‌ప్పుబ‌ట్టింది.

ఏం జ‌రిగింది?

కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి .. శ‌నివారం.. కేర‌ళ‌లోని కోజికోడ్‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఓ యువ‌జ‌న స‌ద‌స్సులో పాల్గొన్నారు. ''నేను ''భారత్ మాతా కీ జై'' నినాదం ఇచ్చినప్పుడు అంతా జై అని అనండి'' అని పిలుపునిచ్చారు. అయితే, ఒక వైపు నుంచి ఎలాంటి నినాదాలు రాలేదు. ముఖ్యంగా పసుపు రంగు చీర ధరించిన ఒక మహిళ మౌనంగా ఉన్నారు. దీంతో మీనాక్షి లేఖి తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. 'భారత్ మాతా కీ జై' అనడం ఇబ్బందిగా అనిపిస్తే సదస్సు నుంచి వెళ్లిపోవాలని అన్నారు. "కొందరు చేతులు కట్టుకుని కూర్చుండిపోతున్నారు. అసలు సమస్య ఏమిటి? భారత్ మీ తల్లి కాదా? జై కొట్ట‌ల‌క‌పోతే.. స‌భ నుంచి వెళ్లిపోండి'' అని గ‌ద్దించారు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది.