భర్త హత్య కేసు: ప్రియుడివి క్షుద్రపూజలు.. భార్యవి బాలీవుడ్ కలలు!
మీరట్ లో మాజీ మర్చంట్ నేవీ అధికారిని అతని భార్య, ఆమె ప్రియుడు హత్య చేసిన కేసులో భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 21 March 2025 11:35 AMరోజు రోజుకీ మానవ సంబంధాలు మాయమైపోతున్నాయి.. మానవ సంబంధాలే కాదు అసలు మనిషన్నవాడే నేటి సమాజంలో మాయమైపోతున్నాడే సందేహం, పలు సంఘటనలను చూసినప్పుడు అనిపిస్తుందని అంటారు. ఇటీవల మీరట్ లో మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ ను అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఘటనతో ఇలాంటి ఇలాంటి సందేహాలే వస్తున్నాయని అంటున్నారు.
అవును... మీరట్ లో మాజీ మర్చంట్ నేవీ అధికారిని అతని భార్య, ఆమె ప్రియుడు హత్య చేసిన కేసులో భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... సౌరభ్ తల, చేతులను ఆమె ప్రియుడు సాహిల్ తన గదికి తీసుకెళ్లాడని చెబుతున్నారు. క్షుద్రపూజలు చెయడానికి అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
పైగా అతడి గదిలో ఓ పిల్లి కూడా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో డ్రగ్స్ కు బానిసైన సాహిల్.. అతీంద్రీయ శక్తులను నమ్ముతాడని, ఇతరులతో చాలా అరుదుగా మాట్లాడతాడని.. ఎక్కువసమయం ఒంటరిగా ఇంట్లోనే గడిపేవాడని.. అతని తల్లి చాలా కాలం క్రితమే చనిపోయిందని దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు.
ఇక బాధితుడు సౌరభ్ భార్య ముస్కాన్ విషయానికొస్తే... ఆమెకు బాలీవుడ్ నటిగా మారాలని బలమైన కోరిక ఉందని, దానికోసం ఆమె చాలాసార్లు ఇంటి నుంచి పారిపోయిందని, దీనివల్ల కూడా దంపతుల మధ్య వాదనలు జరిగాయని చెబుతున్నారు. ఈ విషయాన్ని సౌరభ్ సోదరుడు బబ్లు వెల్లడించాడని అంటున్నారు!
ఈ సందర్భంగా స్పందించిన సీనియర్ పోలీస్ అధికారి ఆయుష్ విక్రమ్... ఈ వ్యవహారంలో ఆర్థిక సమస్యలే హత్యకు ప్రధాన కారణాలుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు.