Begin typing your search above and press return to search.

వీడియో వైరల్... రేవంత్ మెగా ఫ్యాన్స్ మనసు దోచుకున్నట్లేనా?

అవును... రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ పార్క్ ప్రకృతి ప్రేమికులకు అందుబాటులో రానుంది.

By:  Tupaki Desk   |   28 Jan 2025 9:38 AM GMT
వీడియో వైరల్... రేవంత్  మెగా ఫ్యాన్స్  మనసు దోచుకున్నట్లేనా?
X

గత ఏడాది ‘పుష్ప-2’ సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సినిమా హాల్లో బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన ఏ స్థాయిలో చర్చనీయాంశం అయ్యిందనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రధానంగా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుందనే కామెంట్లు బలంగా వినిపించాయి.

ఈ నేపథ్యంలో.. అల్లు అర్జున్ అభిమానులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులయ్యారని.. రేవంత్ రెడ్డి శత్రువర్గంగా మారారనే కామెంట్లూ వినిపించిన పరిస్థితి. మరోపక్క, మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా నడిచిందని అంటారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

మెగా కాంపౌండ్ అంతా ఒకటే అని కొంతమంది అంటే.. ప్రస్తుతం టెరమ్స్ మారాయని.. ఇప్పుడు ‘మెగా వర్సెస్ అల్లు’ వ్యవహారం నడుస్తుందనే విషయం నెట్టింట కొన్ని అంశాలపై కామెంట్ సెక్షన్స్ లో చూస్తే స్పష్టమవుతుందని అంటుంటారు సోషల్ మీడియా పరిశీలకులు. ఈ నేపథ్యంలో.. అల్లు (అర్జున్) ఫ్యాన్స్ ని రేవంత్ దూరం చెసుకున్నారనే చర్చ నడిచింది.

అది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ... తాజాగా మెగా ఫ్యాన్స్ మనసు మాత్రం రేవంత్ రెడ్డి దోచుకున్నారనే చర్చ మాత్రం మొదలైందని అంటున్నారు. దీనికి కారణమైంది.. తాజాగా రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో జరిగిన ఎకో ఫ్రెండ్లీ ఎక్సీపీరియం పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

అవును... రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ పార్క్ ప్రకృతి ప్రేమికులకు అందుబాటులో రానుంది. ఈ పార్క్ ను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని.. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొంటారని అన్నారు. అయితే... ఈ పార్క్ ఓపెనింగ్ సమయంలో రిబ్బన్ కటింగ్ రేవంత్ చేయాల్సి ఉండగా.. దగ్గరుండి మరీ ఆయన చిరంజీవితో కట్ చేయించారనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ఈ సమయంలో.. చిరంజీవి తనదైన నమ్రతతో రిబ్బన్ కట్ చేసి రేవంత్ తో ముందుకు కదిలారు. అనంతరం దీనికి సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించే సమయంలోనూ చిరంజీవిని పక్కకు పిలిచి నిలబెట్టుకున్న రేవంత్ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దీంతో... చిరంజీవికి రేవంత్ ఇచ్చిన గౌరవం, విలువ.. మెగా ఫ్యాన్స్ మనసు దోచుకున్నట్లుగా ఉన్నాయనే కామెంట్లు అప్పుడే మొదలైపోయాయి.

ఇక ఈ పార్క్ ప్రత్యేకతల విషయానికొస్తే.. ప్రపంచస్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఈ పార్కును తీర్చిదిద్దారు. ఇందులో సుమారు 25వేల జాతుల మొక్కలు ఉన్నాయి. అదే విధంగా.. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లు ఉన్నాయి. ఇందులో రూ. లక్ష నుంచి మూడున్నర లక్షల రూపాయల విలువ చేసే అరుదైన వృక్షాలను అందుబాటులో ఉంచారు.

రాందేవ్ రావ్ సుమారు ఆర్న్నరేళ్ల పాటూ శ్రమించి ఈ ఎక్స్ పీరియంను తీర్చిదిద్దారు. ఇందులో రాక్ గార్డెన్ ను సిద్ధం చేశారు. అదేవిధంగా.. 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్ ను ఏర్పాటు చేశారు.