పవన్ కి మెగా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్...స్ట్రాటజీ అదే...?
అందుకే ఈసారి పవన్ కి టోటల్ గా మెగా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అని ప్రచారం సాగుతోంది
By: Tupaki Desk | 1 Aug 2023 5:26 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ కోసం తానుగానే కష్టపడుతున్నారు. ఇప్పటిదాకా ఆయన పార్టీ తరఫున ప్రచారం చేయడానికి మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క నటుడూ రాలేదు. 2019 ఎన్నికల్లో అయితే పవన్ కళ్యాణ్ మొత్తం ప్రచారం తానే నిర్వహించారు. అయితే బ్యాడ్ రిజల్ట్ వచ్చింది.
ఈసారి జనసేనకు కొన్ని ఆశలు ఉన్నాయి. దానికి తగినట్లుగా జనంలో పార్టీకి గ్రాఫ్ పెరిగింది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో గట్టిగా పట్టుకుంటే కనుక జనసేన జెండా ఎగరేయడం ఖాయమని అంటున్నారు. అందుకే ఈసారి పవన్ కి టోటల్ గా మెగా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అని ప్రచారం సాగుతోంది.
దానికి తగినట్లుగా మెగా ఫ్యామిలీ యంగర్ జనరేషన్ హీరోలు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. తాజాగా వుడిదలై థియేటర్లలో నడుస్తున్న బ్రో సినిమా యూనిట్ ఏపీలో పర్యటిస్తోంది. విజయవాడ కనక దుర్గమ్మ వారిని యూనిట్ మెంబర్స్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హీరో సాయి ధర్మ తేజ్ అయితే పవన్ గురించి జనసేన పార్టీ గురించి హాట్ కామెంట్స్ చేశారు.
తామనతా పవన్ వెంటే ఒకే ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి పడేశారు. మాకు రాజకీయాలు తెలియవు. కానీ పవన్ కోసం మాత్రం మేమంతా ఉంటామని తేజ్ చెప్పడం అంటే అది కచ్చితంగా తెర వెనక అంతా ఒక్కటి అవుతున్నారని అంటున్నారు.
నిజానికి చూస్తే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం కోసం మెగా ఫ్యామిలీ అంతా ప్రచారంలోకి వచ్చిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో రాం చరణ్, అల్లు అర్జున్ తో పాటు చాలా మంది హీరోలు వచ్చి ప్రజారాజ్యం జెండాను ఎగరేశారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితి ని చూడవచ్చు అని అంటున్నారు.
ఇటీవల బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వరుణ్ తేజ్ తో పాటు ఇతర హీరోలు కూడా పవన్ కోసం తామంతా ఉన్నామని గట్టిగా చెప్పారు. ఇపుడు చూస్తే సాయి ధర్మ తేజ్ తమ కుటుంబ సభ్యులు అంతా ఏకమొత్తంగా మద్దతుగా నిలుస్తామని చెప్పడం అంటే దాన్ని రాజకీయంగా కీలకమైన పరిణామంగా చూడాల్సి ఉంది అని అంటున్నారు.
మరి అదే కనుక నిజమైతే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీకి దిగుతుందా అన్నది కూడా మరో వైపు చర్చకు వస్తోంది. ఎందుకంటే పవన్ సీఎం అని అంటేనే మెగా ఫ్యామిలీ అంతా ప్రచారంలోకి వస్తుంది. అలా కాకుండా పొత్తులు ఉంటే మాత్రం ప్రచారానికి ఎంత మంది వస్తారో అన్నది కూడా చూదాలని అంటున్నరు. ఏది ఏమైనా ఈసారి జనసేన బరిలోకి దిగడం గట్టిగానే అని అంటున్నారు పదేళ్లు రాజకీయ అనుభవాన్ని పవన్ ఈసారి చూపిస్తారు అని అంటున్నారు.