Begin typing your search above and press return to search.

ఒక లాటరీ.. రూ.13వేల కోట్లు.. ఆ సుడిగాడు ఎక్కడోడంటే?

డాలర్లలో చెప్పాలంటే 1.58 బిలియన్ డాలర్లుగా చెబుతున్న ఈ మొత్తం మన రూపాయిల్లో ఏకంగా రూ.13వేల కోట్లు

By:  Tupaki Desk   |   10 Aug 2023 5:52 AM GMT
ఒక లాటరీ.. రూ.13వేల కోట్లు.. ఆ సుడిగాడు ఎక్కడోడంటే?
X

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.13 వేల కోట్ల రూపాయిలు. ఇంత భారీ మొత్తం లాటరీలో తగలటం అంటే మాటలా? లక్ కు కేరాఫ్ అడ్రస్ నిలిచే లాటరీ వరించటమే గొప్ప అయితే.. ఆ మొత్తం భారీగా ఉండటం అంటే మాటలా? అగ్రరాజ్యం అమెరికాలో నిర్వహించిన భారీ లాటరీకి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. కాకుంటే.. సదరు లాటరీ విజేత ఎవరన్న విషయం మాత్రం బయటకు రాలేదు.

ఫ్లోరిడా మెగా మిలియన్స్ లాటరీలో ఒకరిని భారీ లాటరీ వరించింది.డాలర్లలో చెప్పాలంటే 1.58 బిలియన్ డాలర్లుగా చెబుతున్న ఈ మొత్తం మన రూపాయిల్లో ఏకంగా రూ.13వేల కోట్లు (సుమారుగా). అమెరికా చరిత్రలో మూడో అతి పెద్ద లాటరీ ప్రైజ్ మనీతో ఈ లాటరీని నిర్వహించారు.భారీ ఎత్తున సాగిన ఈ లాటరీకి సంబంధించి.. నెప్యూన్ బీచ్ కు చెందిన పబ్లిక్స్ స్టోర్ అధినేత అమ్మిన టికెట్ కు లాటరీ తగిలింది.

అయితే.. ఈ భారీ మొత్తాన్ని సొంతం చేసుకున్న విజేత వివరాలు మాత్రం బయటకు రాలేదు. డ్రాలో గెలుపొందిన వ్యక్తికి ప్రైజ్ మనీని అందజేస్తారు. కాకుంటే.. ఒక కండీషన్. లాటరీలో గెలుచుకున్న భారీ మొత్తాన్ని ఏకకాలంలో కాకుండా.. ఏడాదికి కొంత మొత్తం చొప్పున ముప్ఫై ఏళ్ల పాటు చెల్లిస్తారు.

అలా వద్దు.. ప్రైజ్ మనీ మొత్తం ఒకేసారి కావాలని కోరితే మొత్తం.. ప్రైజ్ మనీని 783.3 మిలియన్ డాలర్లకు పరిమితం చేస్తారు. ఈ మొత్తం మన రూపాయిల్లో దగ్గర దగ్గర రూ.6488 కోట్లు మాత్రమే ఉంటాయి. మరి.. విజేత ప్రైజ్ మనీ మొత్తాన్ని కోరుకుంటారా? లేదంటే.. ఒకేసారి ఇచ్చే మొత్తాన్ని కోరుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది.