అయోధ్య ఉత్సవానికి ఆహ్వానం అందింది: మెగాస్టార్
భారతదేశంలో ప్రముఖ సెలబ్రిటీలందరికీ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Jan 2024 4:37 AM GMTభారతదేశంలో ప్రముఖ సెలబ్రిటీలందరికీ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందిన సంగతి తెలిసిందే. వీరంతా ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మెగాస్టార్ తనకు పిలుపు అందిన విషయాన్ని మరోసారి ధృవీకరించారు. జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి తాను హాజరవుతానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని, కుటుంబ సమేతంగా ఆ కార్యక్రమానికి హాజరవుతానని చిరు ఒక ప్రకటనలో తెలిపారు. హను-మ్యాన్ ప్రీరిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఈ వివరాల్ని వెల్లడించారు.
ఆసక్తికరంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు డార్లింగ్ ప్రభాస్ తదితర అగ్ర హీరోలు రామమందిర శంకుస్థాపనలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుకున్నారు. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, ప్రఖ్యాత దర్శకులు రాజ్‌కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ, రోహిత్ సహా ప్రముఖ వ్యక్తులకు ఆహ్వానాలు అందాయి.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం రాజకీయ, సినీ పరిశ్రమలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిరం గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఏస్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా కూడా ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు.