Begin typing your search above and press return to search.

అబార్షన్ హక్కులపై ట్రంప్ సతీమణి సంచలన వ్యాఖ్యలు.. ఎవరికి షాక్?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే పలు అంశాలపై ఇప్పుడు కీలక చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 Oct 2024 5:33 AM GMT
అబార్షన్  హక్కులపై ట్రంప్  సతీమణి సంచలన వ్యాఖ్యలు.. ఎవరికి షాక్?
X

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే పలు అంశాలపై ఇప్పుడు కీలక చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇమ్మిగ్రేషన్స్, అక్రమ వలసలు, గంజాయిని చట్టబద్ధం చేయడం మొదలైన అంశాలు కీలకంగా ఉన్నాయని అంటున్నారు. ఈ సమయంలో వీటితో పాటు మరో కీలక అంశం అబార్షన్ హక్కు.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రసవత్తరంగా సాగుతున్న వేళ అబార్షన్ హక్కు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య జరిగిన డిబేట్ లో ఈ అబార్షన్ అంశంపై ఇరువురూ వాడీవేడిగా వాదించారు. ఈ క్రమంలో ట్రంప్ సతీమణి మెలానియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దీంతో... ఇవి ట్రంప్ అభిప్రాయానికి భిన్నంగా ఉన్నాయనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి. కారణం... అబార్షన్ హక్కులపై అధికారం రాష్ట్రాలకే ఉండాలని ట్రంప్ వాదిస్తుండగా.. అబార్షన్ హక్కు మహిళకే ఉండాలని, ఆమె శరీరంపై అంతిమ నిర్ణయం ఆమెదే అని అంటూ అబార్షన్ హక్కును మెలానియా బలంగా సమర్ధిస్తున్నారు.

నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. దానికి కొన్ని వారాల ముందు "మెలానియా" పేరుతో అక్టోబర్ 8న విడుదల కానుంది. ఈ మెమోర్ లో ఈ అంశం గురించి ఆమె తన అభిప్రాయాన్ని పొందుపరిచారని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ సందర్భంగా... "ఆమె శరీరం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు ఆమెకు కాకుండా ఇంకెవరో ఎందుకు ఉండాలి? అబార్షన్ విషయంలో ఆమె నిర్ణయాన్ని పరిమితి చేయడం అంటే.. ఆమె సొంత శరీరంపై నియంత్రణను నిరాకరించడం కిందకే వస్త్తుంది" అని ఆమె రాసుకొచ్చారని అంటున్నారు!

మరోవైపు ఇదే విషయంలో గతంలో స్పందించిన కమలా హారిస్... అబార్షన్లపై ట్రంప్ నిషేధం విధించాలనుకుంటున్నారని.. అత్యాచారాల వంటి కేసుల్లోనూ మహిళలకు ఎలాంటి మినహాయింపూ ఇవ్వాలనుకోవడం లేదని.. ఇది మహిళలను అవమానించడమే అని.. అబార్షన్ పై మహిళే నిర్ణం తీసుకొగలరని ఓ డిబేట్ లో వ్యాఖ్యానించారు.

దీనిపై స్పందించిన ట్రంప్.. అబార్షన్ పై నిషేదానికి తాను అనుకూలం కాదని.. కాకపోతే ఎనిమిది తొమ్మిది నెలల్లో అబార్షన్ ఎలా చేస్తారనే దానికి మాత్రం తాను అనుకూలం కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారం రాష్ట్రాలకే ఉండాలని అన్నారు.