Begin typing your search above and press return to search.

మెటాలో ఫ్యాక్ట్ చెకర్ లను తొలగించిన జుకర్ బర్గ్... ట్రంప్ కోసమేనా?

ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారగా.. ఇది ట్రంప్ కోసమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   8 Jan 2025 1:30 PM GMT
మెటాలో ఫ్యాక్ట్  చెకర్  లను తొలగించిన జుకర్  బర్గ్... ట్రంప్  కోసమేనా?
X

ప్రముఖ టెక్ సంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఓ కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా ఫేక్, హానికర సమాచారాల వ్యాప్తిని కట్టడి చేసేందుకు అనుసరిస్తోన్న విధానాల్లో మెటా మార్పులు చేసిందని.. ఇందులో భాగంగా ఫ్యాక్ట్ చెకర్ లను తొలగించిందని వెల్లడించారు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారగా.. ఇది ట్రంప్ కోసమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... తాజాగా ఫ్యాక్ట్ చెకర్ లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్. దీంతో... త్వరలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ టీమ్ కు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేసిన మార్క్ జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... సెన్సార్ షిప్ అధిక స్థాయిలో ఉన్న పరిస్థితికి తాము చేరుకున్నామని.. ఈ సమయంలో తాము తమ తమ తప్పులను తగ్గించుకోవడంపై దృష్టి పెడతామని.. తమ ఫ్లాట్ ఫామ్ లలో భావవ్యక్తీకరణను పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకుంటామని జుకర్ బర్గ్ తెలిపారు. ఈ నిర్ణయంపై అటు ట్రంప్, ఇటు మస్క్ ఇద్దరూ సానుకూలంగా స్పందించారు.

ఇందులో భాగంగా... ఇది ఆకట్టుకునే నిర్ణయం అంటూ అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించగా... ఈ మార్పులను ఎలాన్ మస్క్ వెల్ కం చేశారు. కాగా... ఈ టెక్ సంస్థలో ఉన్న ఫ్యాక్ట్ చెకింగ్ నిబంధనలను ట్రంప్, మస్క్ లు ఇద్దరూ గతంలో తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. 'సెన్సార్ షిప్' అంటూ వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా... తాజా నిర్ణయంతో ఇన్ స్టా, ఫేస్ బుక్, థ్రెడ్ సహా అన్ని మెటా ఫ్లాట్ ఫాం లలోఈ ఫ్యాక్ట్ చెకింగ్ తొలగింపు అమలవుతుంది.