Begin typing your search above and press return to search.

డ్రగ్స్ ముఠా మధ్య గ్యాంగ్ వార్... తలలు పట్టుకున్న అధికారులు!

ఈ ప్రపంచానికి ఉన్న అతిపెద్ద సమస్యల్లో పేదరికం, టెర్రరిజం, కాలుష్యం తో పాటు డ్రగ్స్ అనేది మరింత పెద్ద సమస్యగా పరిణమించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 Sep 2024 10:16 AM GMT
డ్రగ్స్  ముఠా మధ్య గ్యాంగ్  వార్... తలలు పట్టుకున్న అధికారులు!
X

ఈ ప్రపంచానికి ఉన్న అతిపెద్ద సమస్యల్లో పేదరికం, టెర్రరిజం, కాలుష్యం తో పాటు డ్రగ్స్ అనేది మరింత పెద్ద సమస్యగా పరిణమించిన సంగతి తెలిసిందే. ఈ మాదక ద్రవ్యాల వల్ల మనిషిలో మానవత్వమే కాదు.. కొన్ని ప్రాంతల్లో మనిషే అంతరించిపోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సమస్య ప్రపంచం మొత్తం వ్యాపించేస్తున్న పరిస్థితి.

ఈ పరిస్థితుల్లో డ్రగ్స్ ముఠాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న ఘర్షణలు పీక్స్ కి చేరాయి. ఈ సమయంలో తమ దేశంలో డ్రగ్స్ కలకలానికి, డ్రగ్స్ ముఠాల మధ్య జరుగుతున్న ఘర్షణలకు అమెరికా కూడా కారణం అంటూ ఆరోపిస్తుంది మెక్సికో. తాజాగా ఆ దేశంలో జరిగిన ఘర్షణల్లో భారీ సంఖ్యలో మరణాలు సంభవించగా.. అదే సంఖ్యలో గల్లతులూ ఉన్నాయని అంటున్నారు.

అవును... ప్రపంచ దేశాల్లోని అత్యంత హింసాత్మకమైన ప్రాంతాల్లో ఒకటైన మెక్సికోలోని సినాలోవా కార్టెల్ లో డ్రగ్స్ ముఠాల మధ్య జరుగుతోన్న గ్యాంగ్ వార్ లో ఇప్పటివరకూ సుమారు 53 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఇదే క్రమంలో... సుమారు మరో 51 మంది ఆచూకీ గల్లంతైందని అంటున్నారు. ఇప్పటివరకూ 40 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ ఏడాది జూలైలో డ్రగ్స్ డాన్ ఇస్మాన్ ఎల్ మయో జంబాడ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి ఇక్కడ హింస తారా స్థాయికి చేరింది. ఈ హింసను కట్టడి చేయలేక అధికారులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. అనంతరం జంబాడ స్పందిస్తూ... కార్టెల్ కు చెందిన ఓ గ్రూపు సభ్యూడు తనను కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించాడని ఆరోపించాడు.

వాస్తవానికి 2017లో ఎల్ మయో జంబాడ, జోక్విన్ ఎల్ చాపో తో కలిసి సినాలోవా కార్టెల్ లో డ్రగ్స్ దందా మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొద్ది కాలానికే ఎల్ చాపో అరెస్టయ్యాడు. అనంతరం అతని నలుగురు కుమారులూ ట్రాఫికింగ్ మాఫియాలో పడ్డారు. ఇదే సమయంలో అమెరికాకు పెంటానికల్ డ్రగ్ ను ఎగుమతి చేసే అతిపెద్ద ఎక్స్ పోర్టర్ గా పేరు పోందారు.

ఈ సమయంలోనే జూలైలో ఎల్ మయో జంబాడ అమెరికాలో అరెస్టయ్యాడు. నాటి నుంచి సినాలోవా కార్టెల్ లోని గ్రూపు సభ్యుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవల అవి పీక్స్ కి చేరుతున్నాయి. ఈ హింసను కట్టడి చేయడం మెక్సికో మిలటరీకి కూడా కష్ట సాధ్యంగా మారిందంటే పరిస్థితి అర్ధం చేసుకొవచ్చు.

ఈ సందర్భంగా స్పందించిన మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయేల్ లోపేజ్ ఒబ్రడార్... తమ దేశంలో జరుగుతున్న హింసకు అమెరికా కూడా ఓ కారణమని వ్యాఖ్యానించారు. దీంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు మెక్సికో దాటి హాట్ టాపిక్ గా మారింది.