Begin typing your search above and press return to search.

వీకెండ్ డ్రైవర్స్... మొన్న మేనేజర్ - నేడు మైక్రోసాఫ్ట్ ఇంజినీర్!

ఈ క్రమంలో తాజాగా మైక్రోసాఫ్ట్ లో ఇంజినీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి వీకెండ్స్ లో ఆటో నడుపుకుంటున్న ఘటన తెరపైకి వచ్చింది

By:  Tupaki Desk   |   22 July 2024 11:30 PM GMT
వీకెండ్ డ్రైవర్స్... మొన్న మేనేజర్ - నేడు మైక్రోసాఫ్ట్ ఇంజినీర్!
X

ఇటీవల కాలంలో కొంతమంది కార్పొరేట్ కంపెనీలో భారీ జీతాలకు పనిచేసే వారు సైతం వీకెండ్స్ లో ర్యాపిడో డ్రైవర్స్ గా, క్యాబ్ డ్రైవర్స్ గా పని చేస్తున్నారంటూ నెట్టింట పలు పోస్టులు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మైక్రోసాఫ్ట్ లో ఇంజినీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి వీకెండ్స్ లో ఆటో నడుపుకుంటున్న ఘటన తెరపైకి వచ్చింది. దానికి గల రీజన్ వైరల్ గా మారింది.

అవును... తాను బుక్ చేసిన ర్యాపిడో డ్రైవర్ ఓ ప్రముఖ కంపెనీలో కార్పొరేట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడని తెలుసుకొని ఆశ్చర్యపోయినట్లు గతంలో ఓ మహిళ పోస్ట్ చేశారు. అప్పట్లో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇదే క్రమంలో తాజాగా ఓ నెటిజన్... తాను ఓ ఆటోలో ప్రయాణించినప్పుడు ఆ ఆటో నడిపిన వ్యక్తి మైక్రోసాఫ్ట్ ఇంజినీర్ అని తెలుసుకున్నట్లు తెలిపారు. అందుకు గల కారణం షాకిచ్చిందని తెలిపారు.

వివరాళ్లోకి వెళ్తే... తాజాగా ఓ నెటిజన్ కోరమంగళలో ఆటో బుక్ చేసుకున్నప్పుడు ఓ డ్రైవర్ తనను పిక్ చేసుకున్నాడని తెలిపారు. ఆ సమయంలో ఆ ఆటోడ్రైవర్ మైక్రోసాఫ్ట్ లోగో ఉన్న హుడీని ధరించి ఉండటంతో ఆశ్చర్యపోయినట్లు చెప్పుకొచ్చారు. ఈ సమయంలో అతడితో మాట కలపగా.. తాను మైక్రోసాఫ్ట్ లో ఇంజినీర్ అని, ఒంటరి తనం భరించలేక, ఆ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఇలా వారాంతాల్లో ఆటో నడుపుతున్నట్లు తెలిపారని పేర్కొన్నారు.

దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ బిజీ ప్రపంచంలో ఓ మనిషి మరో మనిషితో మనసు విప్పి మాట్లాడుకునే సమయం కూడా లేకుండా జీవితాలు యంత్రికమైపోయిన నేపథ్యంలో... ఇలాంటి పరిస్థితులు బెంగళూరు వంటి నగరాల్లో తరచూ కనిపిస్తున్నాయని అంటున్నారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా ఉండే ఉద్యోగుల మానసిక ఇబ్బందులు పీక్స్ అని నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు. ఇందులో భాగంగా... "నారయాణ మూర్తి సలహాలు పాటిస్తున్నట్లున్నారు" అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా... "అవునా... నిజమా?" అంటూ మరొకరు షాకింగ్ ఎక్స్ ప్రెషన్ పెట్టారు. "ఈ పని సైడ్ బిజినెస్ గా చేస్తే మంచి డబ్బులే వస్తాయి" అ మరొకరు స్పందించారు.