మనోళ్ల బంగారం కొనే ట్రెండ్ క్రాక్ చేసిన తాజా రిపోర్టు!
బంగారం మొదలు బిస్కెట్ పాకెట్ వరకు. స్మార్ట్ ఫోన్ నుంచి శారీ వరకు.. కొనే వస్తువు ఏదైనా భారతీయ మధ్యకుటుంబాల లెక్కేను కళ్లకు కట్టినట్లుగా చూపించిందో రిపోర్టు.
By: Tupaki Desk | 17 Feb 2025 8:00 PM ISTబంగారం మొదలు బిస్కెట్ పాకెట్ వరకు. స్మార్ట్ ఫోన్ నుంచి శారీ వరకు.. కొనే వస్తువు ఏదైనా భారతీయ మధ్యకుటుంబాల లెక్కను కళ్లకు కట్టినట్లుగా చూపించిందో రిపోర్టు. దేశీయ మధ్యతరగతి ప్రజల కొనుగోళ్ల మీద పరిశోధన చేసిన సంస్థ ఒకటి.. తాము గుర్తించిన విషయాల్ని వెల్లడించింది. ఈ వివరాల్ని చూసినప్పుడు సర్ పరై్ అవ్వాల్సిందే. కారణం.. ఓవైపు ప్రీమియం వస్తువుల్ని ఎడాపెడా కొనేస్తూ.. రోజువారీగా వినియోగించేకొన్ని వస్తువుల విషయంలో వారి లెక్కల్లోని వేరియేషన్స్ కు దిమ్మ తిరిగిపోవాల్సిందే.
సదరు రిపోర్టు పేర్కొన్న అంశాల్ని చూస్తే.. టీవీలు.. ఫ్రిజ్ లు.. వాషింగ్ మెషీన్లు.. స్మార్టు ఫోన్లు లాంటి వాటిని కొనే విషయంలో ప్రీమియం ఉత్పత్తుల్ని కొనేందుకు అస్సలు వెనుకాడటంలేదు. అయితే.. ఇక్కడో ట్విస్టు ఉంది. ప్రీమియం వస్తువుల్ని కొనుగోలు చేసే వారిలో అత్యధికులు నెలవారీ వాయిదాల పద్దతినే ఫాలో అవుతున్నారు. అలా అయితే.. తేలిగ్గా రుణాల్ని తీర్చేస్తామన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే రోజువారీగా వినియోగించే సబ్బులు..స్నాక్స్.. బిస్కెట్లు.. టీ.. కాఫీ పొడి లాంటి వాటిని మాత్రం చిన్న పాకెట్లను కొనుగోలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఖరీదైన గృహోపకరణాలను ఈవీఎం పద్దతిన కొనుగోలు చేయటం కొన్నేళ్లుగా నడుస్తున్నా.. ఇప్పుడు మరింత పెరిగినట్లుగా నివేదిక వెల్లడించింది. గతంలో తమ స్థాయికి తగ్గ బడ్జెట్లలో వస్తువుల్ని కొనుగోలు చేసేవారని.. ఇప్పుడు అందుకు భిన్నమైన ధోరణి ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనుగోలు చేసే వేళలో.. కొనుగోలు తర్వాత సేవలు ఏ విధంగా ఉంటున్నాయి? అన్న దానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు రిపోర్టు తెలిపింది. ఈవీఎంలపై కొనుగోళ్లు ఐదేళ్ల క్రితం 55-60శాతం ఉంటే.. ప్రస్తుతం 75 శాతానికి పైనే పెరిగినట్లుగా పేర్కొన్నారు. సులువుగా రుణ సదుపాయం.. జీరో కాస్ట్ ఈఎంఐ కూడా ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు తెలిపారు. బంగారం ధర అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. ఆభరణాల కొనుగోలు విషయంలో కొత్త ధోరణి పెరిగినట్లుగా చెబుతుననారు.
నెల వారీగా డబ్బులు కట్టి.. పన్నెండు నెలల తర్వాత పోగైన మొత్తంతో బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేసే ధోరణి ఎక్కువైనట్లుగా తెలిపింది. దీనికి సంబంధించి పలు పథకాలు ఉండటంతో ఆ తరహా కొనుగోళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా రిపోర్టు వెల్లడించింది. మొత్తంగా చూస్తే..ఓవైపు ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు విషయంలో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తూనే.. మరోవైపు రోజువారీ వస్తువుల విషయంలో ఆచితూచి అన్నట్లు కొనుగోళ్లు చేయటం ఆసక్తికరంగా మారింది.