Begin typing your search above and press return to search.

చంద్రబాబుతో అర్ధరాత్రి భేటీ : ఆ ప్రముఖ కాంగ్రెస్ నేత ఎవరు...?

కోర్టు ఆంక్షల నేపధ్యంలో ఆయన రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు, మీడియా ముందుకు రాకూడదు.

By:  Tupaki Desk   |   13 Nov 2023 3:20 PM GMT
చంద్రబాబుతో అర్ధరాత్రి భేటీ : ఆ ప్రముఖ  కాంగ్రెస్ నేత ఎవరు...?
X

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. అయినా సరే ఆయన వ్యూహాలు ఇంకా అలా సాగుతూనే ఉంటాయని అంటారు. ఏకంగా 52 రోజుల పాటు చంద్రబాబు జైలులో గడిపి మధ్యంతర బెయిల్ మీద ఇటీవలనే బయటకు వచ్చారు. ఇక చంద్రబాబు కంటికి ఆపరేషన్ జరిగింది. ఆయన ఇంటి పట్టునే ఉంటున్నారు. కోర్టు ఆంక్షల నేపధ్యంలో ఆయన రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు, మీడియా ముందుకు రాకూడదు.

అయితే చంద్రబాబుని ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆ తరువాత మరో సంఘటన తాజాగా వైరల్ అవుతోంది. చంద్రబాబుని పగలు కాకుండా అర్ధరాత్రి భేటీ అయి పరామర్శ పేరుతో ఒక కీలక కాంగ్రెస్ నేత చర్చలు జరిపారు అన్నదే ఆ వార్త. ఆ కాంగ్రెస్ నేత సామాన్యుడు కారని, ఆయన ఏకంగా సీఎం రేసులో ఉన్నారని కూడా అంటున్నారు.

ఆయన చంద్రబాబుని కలసి తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో ఆయన నుంచి సలహాలను కూడా తీసుకున్నట్లుగా కూడా ప్రచారం అయితే సాగుతోంది. చంద్రబాబు సైతం ఆయనకు దిశా నిర్దేశం చేశారని అంటున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు వ్యూహాత్మకంగానే తెలంగాణా ఎన్నికల్లో టీడీపీని పోటీ పెట్టలేదని అంటారు. బీయారెస్ వ్యతిరేక ఓట్లు చీలిపోతే బీయారెస్ మరోసారి అధికారంలోకి వస్తుంది అన్న ఎత్తుగడతోనే పోటీకి పెట్టలేదని అంటారు.

ఇక ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి మద్దతుగా కూడా టీడీపీ పనిచేస్తోందని అంటున్నారు. తెలంగాణాలో తమకు కావాల్సిన వారు సీఎం అయితే ఏపీలో కూడా టీడీపీ పుంజుకుంటుదని, ఆ విధంగా తెలంగాణా నుంచి ఏపీలో కూడా వైసీపీని దెబ్బ తీసే వ్యూహంగా ఉంటుందని భావించే చంద్రబాబు కాంగ్రెస్ ని పరోక్ష మద్దతు ఇస్తున్నారు అని అంటారు. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ టీడీపీ ఓట్లు ఎక్కువగా ఈసారి కాంగ్రెస్ కి వెళ్తాయని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంచితే కాంగ్రెస్ అగ్ర నేత కాబోయే ముఖ్యమంత్రి అని అనుకుంటున్న నాయకుడు బాబుతో అర్ధరాత్రి భేటీ వేశారు అన్న వార్త మాత్రం రాజకీయంగా దుమారం రేపుతోంది. నిజంగా అలా జరిగిందా బాబు ఆయనతో భేటీ అయ్యారా అన్నది తెలియడంలేదు కానీ సోషల్ మీడియాను ఈ వార్త తెగ ఊపేస్తోంది. ఇదే నిజం అయితే మాత్రం టీడీపీ వ్యూహాలు వేరే లెవెల్ లో ఉన్నాయని అంటున్నారు.

అంతే కాదు సదరు కాంగ్రెస్ అగ్ర నేత సీఎం కుర్చీలో కూర్చోవడం అంటే టీడీపీకి తానే మరోమారు తెలంగాణాలో అధికారంలోకి వచ్చినట్లుగా ఉంటుందని కూడా అంటున్నారు. మొత్తానికి బాబు చేత దిశా నిర్దేశం చేయించున్న ఆ నేత ఎవరు అన్నది మాత్రం తెలియడంలేదు. బాబు వ్యూహాలు పదును తేరి ఉంటాయి.

మరి ఆ వ్యూహాలను కనుక కాంగ్రెస్ నేత అమలు చేస్తే విజయం వచ్చి ఒడిలో వాలాలి అని అంటున్నారు. ఈ పరిణామాలను అధికార బీయారెస్ నిశితంగా పరిశీలిస్తున్నా ఏమీ మాట్లాడడం లేదు అని అంటున్నారు. ఏది ఏమైనా బాబు మార్క్ వ్యూహాలు అయితే తెలంగాణా ఎన్నికల్లో అమలు అవుతున్నాయని అంటున్నారు.

టీడీపీ పోటీ చేయకపోయినా బాబు బయటకు రాకపోయినా ఆయన చుట్టూ తెలంగాణా రాజకీయం సాగడం విశేషం. ఇవన్నీ చూస్తూంటే రేపటి రోజున తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనుక టీడీపీకి క్రెడిట్ బాగానే దక్కేట్లు ఉందని అనే వారూ ఉన్నారు.