Begin typing your search above and press return to search.

నేనే ప్రధాని అయితే.. భారత్ పై అణుబాంబు.. యూట్యూబర్ నోటి దూల

అది కూడా ప్రపంచంలో యుద్ధాలు కమ్ముకున్న వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేంతగా.. ఇంతకూ ఎవరతడు అంటే..

By:  Tupaki Desk   |   23 Aug 2024 11:46 AM GMT
నేనే ప్రధాని అయితే.. భారత్ పై అణుబాంబు.. యూట్యూబర్ నోటి దూల
X

అతడో యూ ట్యూబర్.. ట్రావెలింగ్ చేస్తూ ఆ వీడియోలను పెట్టి ప్యాషన్ ను తీర్చుకుంటాడు.. అంతేకాదు యుద్ధం వంటి సంక్షోభ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో వద్దన్నా పర్యటించి వీడియోలు చేయడం అతడికి సరదా.. దేశదేశాల్లో తిరిగే అలాంటి వాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి.. కానీ, ఈ బ్రిటీష్ యూట్యూబర్ కు నోటి దూల ఎక్కువ. అది కూడా ప్రపంచంలో యుద్ధాలు కమ్ముకున్న వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేంతగా.. ఇంతకూ ఎవరతడు అంటే..

మైల్స్ రౌట్‌ లెడ్జ్ అనేవాడు బ్రిటన్ కు చెందిన యూ ట్యూబర్. ప్రధాని అయితే తాను భారత్‌ పై అణుబాంబు వేస్తానంటూ అతడు మాట తూలాడు. భారత్‌ తో పాటు పలు దేశాల గురించి ప్రస్తావిస్తూ అవాకులు, చెవాకులు పలికాడు. తాను ప్రధాని అయితే గనుక చిన్నపాటి ఉల్లంఘనకు పాల్పడినా ఆయా దేశాలపై అణుబాంబులు వేస్తానంటూ వాగాడు. చివరకు అదంతా జోక్‌ అని అన్నాడు. ఎక్స్ లో అతడు పోస్ట్ చేసినదాని ప్రకారం.. ‘‘నేను బ్రిటన్ ప్రధాని అయ్యాక మా దేశ ప్రయోజనాలకు ఆటంకం కలిగించే విదేశానికి అణు మార్గంలోనే జవాబిస్తానని స్పష్టమైన హెచ్చరికలు చేస్తా. పెద్ద ఘటనలు జరిగేవరకు వేచి చూడను. చిన్నపాటి ఉల్లంఘనలే అయినా అణ్వాయుధాలు ప్రయోగిస్తా’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి దేశాల జాబితాలో భారత్‌ ను కూడా చేర్చాడు. భారత్ అంటే తనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించాడు. దీంతో రౌట్ లెడ్జ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

ప్రమాదకర టూరిస్టు..

మైల్స్‌ రూట్‌ లెడ్జ్‌ సాహస యాత్రికుడే. ప్రపంచంలో సంక్షోభ ప్రాంతాల్లో పర్యటిస్తుంటాడు. అందులోనూ విపత్తుల వేళ ఆ దేశ ప్రజలు ఎంతటి దుర్భర జీవితం గడుపుతున్నారో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.మూడేళ్ల కిందట ఆగస్టు 15న అఫ్గానిస్థాన్‌ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన సందర్భంలో బ్రిటన్ ప్రభుత్వం వద్దంటున్నా అక్కడకు వెళ్లాడు. తాలిబన్లు అధికారం చేపట్టడానికి రెండు రోజుల ముందే అఫ్గాన్ లో వాలాడు. చివరకు అక్కడ చిక్కుకుపోయాడు. నాలుగు రోజుల తర్వాత బ్రిటన్ సైన్యం బయటపడేసింది. ఎలాగంటే.. బుర్ఖా ధరించి అఫ్ఘాన్ నుంచి బయటపడ్డాడు. ఆ అనుభవాలపై పుస్తకం రాశాడు. ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్ తో పాటు రెండున్నరేళ్లుగా యుద్దం జరుగుతున్న ఉక్రెయిన్‌ కు కూడా వెళ్లాడు.