సీఎం కాన్వాయ్ పై మిలిటెంట్ల దాడి... సెక్యూరిటీ దళాలపై ఫైరింగ్!
మణిపూర్ లోని కంగ్ పోక్ పి జిల్లాలో ఈరోజు ఈ అటాక్ జరిగింది. ఆ దాడిలో ఒకరు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.
By: Tupaki Desk | 10 Jun 2024 10:52 AM GMTమణిపూర్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మరోసారి కొంతమంది అరాచకవాదులు రెండు పోలీస్ అవుట్ పోస్టులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసులతో పాటు మేతీ, కుకీ తెగల వారికి చెందిన సుమారు 70 ఇళ్లను తగలబెట్టడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా సీఎం కాన్వాయ్ పై మిలిటెంట్లు దాడి చేశారు. దీంతో.. ఈ విషయం వైరల్ గా మారింది.
అవును... మణిపూర్ లోని జిరిబాం జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నా.. ప్రస్తుతానికైతే నియంత్రణలోనే ఉన్నాయని పోలీసులు తెలిపిన 24 గంటల్లో ఊహించని పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ సెక్యూరిటీ కాన్వాయ్ పై అనుమానిత మిలిటెంట్లు దాడిచేశారు.
మణిపూర్ లోని కంగ్ పోక్ పి జిల్లాలో ఈరోజు ఈ అటాక్ జరిగింది. ఆ దాడిలో ఒకరు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ వాహనంలోని డ్రైవర్ కు కుడి భుజంపై బుల్లెట్ గాయాలు తగిలాయని, అతన్ని ఇంఫాల్ లోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
శనివారం హింస చోటుచేసుకున్న జిరిబాం జిల్లాకు కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని చెబుతున్నారు. ఈ సమయంలో సీఎం సెక్యూరిటీ దళాలపై మిలిటెంట్లు పలుమార్లు కాల్పులు జరిపారని అంటున్నారు. నేషనల్ హైవే 53 సమీపంలో ఉన్న కొంట్లెన్ గ్రామం వద్ద ఎదురుకాల్పులు జరుగుతున్నాయని అంటున్నారు.