తప్పులు సరిదిద్దుకుంటారా... జగన్ ముందు మిలియన్ డాలర్ల ప్రశ్న ..!
క్రిస్మస్ సందర్భంగా ఆయ న బెంగళూరు నుంచి సొంత నియోజకవర్గం పులివెందులకు చేరుకున్నారు.
By: Tupaki Desk | 25 Dec 2024 1:30 PM GMTతప్పులు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందలకొద్దీ తప్పులు.. ఇవీ.. వైసీపీ అధినేతకు ఎదురవుతు న్న ప్రధాన అంశాలు. ప్రస్తుతం ఆయన సొంత నియోజకవర్గంలోనే ఉన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆయ న బెంగళూరు నుంచి సొంత నియోజకవర్గం పులివెందులకు చేరుకున్నారు. అయితే.. ఇక్కడి పరిస్థితి కూడా అత్యంత దారుణంగానే ఉంది. ఎవరూ మాట వినే పరిస్థితిలో లేరు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
మరీముఖ్యంగా.. అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు జగన్‌కు శాపంగా మారింది. తనను తాను విడమరిచి చెప్పుకోవడంలో ఆయన విఫలమయ్యారు. ఫలితంగా.. అప్పటి సంగతులే ఇప్పుడు తెరమీదికి వస్తున్నాయి. అప్పట్లో కనీసం తాడేపల్లి గేటు దగ్గరకు కూడా.. తమను రానివ్వలేదం టూ.. కొందరు నాయకులు ప్రశ్నించారు. తాము చేతి చమురు వదిలించుకుని పెట్టుబడులు పెట్టి కాంట్రాక్టు పనులు చేస్తే.. వాటికి సంబంధించిన సొమ్ము కూడా.. మధ్యలోనే బొక్కేశారని.. పది మంది కాంట్రాక్టర్లు లబోదిబోమన్నారు.
కనీసం.. జగన్ అప్పాయింట్మెంటు కూడా.. పొందలేని పరిస్థితి ఉందని మాజీ ఎమ్మెల్యే ఒకరు చెప్పుకొ చ్చారు. తమ మాట వినకుండానే.. కడప స్టీల్ ప్లాంటుకు నాలుగు సార్లు ప్రారంభోత్సవాలు చేశారని.. దీనివల్ల జిల్లాలో చులకన అయిపోయామని మరో ఇద్దరు ముఖ్య నాయకులు చెప్పుకొచ్చారు. పులివెందు లకు నీరిచ్చే పట్టిసీమను నిర్లక్ష్యం చేయడంతో ఇక్కడి ప్రజలకు దూరమయ్యామని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే.. బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది.
వెరసి ఎటు చూసినా.. పులివెందుల, కడప జిల్లాలోని పరిస్థితులు.. జగన్‌కు చాలా వరకు సమస్యగానే ఉన్నాయి. తప్పులు ఎత్తి చూపుతుంటే.. నాయకులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కూడా ఏర్పడిం ది. నేనున్నానని భరోసా ఇస్తున్నా.. వినిపించుకునే నాయకుడు అయితే కనిపించడం లేదు. ఇప్పటికే చాలామంది పార్టీ మారి.. కూటమికి జై కొట్టగా.. మరికొందరు రేపో మాపోఅన్నట్టుగా ఉన్నారు. ఈ పరిణామాలను ఎలా సర్దుబాటు చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది.