మిలియనీర్ల నగరంగా బెంగళూరు.. సరికొత్త రికార్డ్!
కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఐటీ రాజధానిగా పెద్ద పేరున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 9 May 2024 2:30 PM GMTకర్ణాటక రాజధాని బెంగళూరుకు ఐటీ రాజధానిగా పెద్ద పేరున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఇదే బెంగళూరు మిలియనీర్ల నగరంగా సరికొత్త రికార్డును సృష్టించింది. గత పదేళ్లలో మిలియనీర్లు.. అంటే కోట్లకు పడగలెత్తిన వారు.. ఈ నగరంలో రెట్టింపు అయ్యారట. దీంతో ప్రపంచంలో గడిచిన పదేళ్ల కాలంలో మిలియనీర్లు.. డబుల్ అయిన నగరాల్లో బెంగళూరు.. తొలిస్థానం దక్కించుకుంది. తర్వాత.. స్థానాల్లో వియత్నాంలోని హోచిమిన్ నగరం, తర్వాత.. అమెరికాలోని స్కాట్స్ డేల్ నగరాలు ఉన్నాయి.
గత పదేళ్లలో బెంగళురులోని కోటీశ్వరులు రెట్టింపు అయ్యారని చెప్పినా.. ఆ లెక్క ఎంత అనేది తెలియా ల్సి ఉంది. ఈమేరకు ప్రపంచం నగరాల్లో కోటీశ్వరుల సంఖ్యను లెక్కగట్టే ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థ హెన్లీ & పార్ట్‌నర్స్ ఈ వివరాలు వెల్లడించింది. ఈ సంస్థ రెండు విధాలుగా లెక్కలు వేసింది. ఒకటి గడిచిన రెండు మూడు సంవత్సరాల్లో కోటీశ్వరులు రెట్టింపయిన నగరాలు.. రెండోది గడిచిన పదేళ్లలో రెట్టింపైన నగరాలు అనే జాబితాలు సిద్ధం చేసింది.
గత రెండు మూడేళ్లలో కోటీశ్వరులు రెట్టింపై నగరాలు ఇవీ..
+ న్యూయార్క్: ఇక్కడ దాదాపు 3 లక్షల మంది మిలియనీర్తు ఉన్నారు. ఒక్కొక్కరు దాదాపు 3 ట్రిలియన్ డాలర్ల సంపద పోగేసుకున్నారు. గత రెండు మూడేళ్లలో ఇక్కడ కుబేరులు 4 శాతం మేరకు పెరిగారు. దాదాపు ఒక్కొక్కరి దగ్గరా 800 కోట్లకు పైగా సంపద ఉందని తెలిపింది.
+ శాన్ జోస్, శాన్ ఫ్రాన్సిస్కో, బేఏరియా, పాలో ఆల్టోల వంటి నగరాల్లో 3 లక్షల మంది కోట్ల రూపాయల సంపద కలిగి ఉన్నారట.
+ టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో అత్యధిక సంఖ్యలో మిలియనీర్స్ ఉన్నట్టు హెన్లీ & పార్ట్‌నర్స్ వివరించింది.
+ సింగపూర్: ఇక్కడ కూడా.. కోటీశ్వరుల సంఖ్యకు అంతులేదని పేర్కొంది. ఇది నాలుగోస్థానంలో ఉంది.
గడిచిన పదేళ్లలో.. కోటీశ్వరులు రెట్టింపైన నగరాలు
+ బెంగళూరు: ఇక్కడ గత పదేళ్లలో మిలియనీర్లు రెట్టింపయ్యారు.
+ హోచిమిన్ సిటీ: వియత్నాంలోని ఈ నగరంలోనూ కోటీశ్వరులు రెట్టింపయ్యారు.
+ స్కాట్స్‌డేల్: అమెరికాలోని స్కాట్స్‌డేల్‌లో కూడా గత పదేళ్లలో కోటీశ్వరులు రెట్టింపయ్యారు.
+ అందరూ సంపన్న నగరంగా భావించే దుబాయ్ ఈ జాబితాలో 21వ స్థానం దక్కించుకుంది.
+ మొనాకో నెంబర్ 1 స్థానంలో ఉంది. మొనాకోలో సుమారు 40%కి పైగా మిలియనీర్లు ఉన్నారట.
ఎలా పెరిగింది?
+ గ్లోబల్ ఈక్విటీలు సుమారు 20% పెరడం.
+ ఏటా 7 శాతం చొప్పున పెంపు నమోదు కావడం.
+ లండన్ తన మిలియనీర్ జనాభాలో 10% కోల్పోయింది.