Begin typing your search above and press return to search.

అజారుద్దీన్‌ కు అలా చెక్ పెడుతున్న కేసీఆర్!

తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యక్ష మిత్రులు, పరోక్ష మిత్రులు అనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   4 Nov 2023 7:17 AM GMT
అజారుద్దీన్‌  కు అలా చెక్  పెడుతున్న కేసీఆర్!
X

తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యక్ష మిత్రులు, పరోక్ష మిత్రులు అనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ కు కమ్యునిస్టులు, వైఎస్సార్టీపీ పార్టీలు ప్రత్యక్ష మిత్రులు కాగా.. టీడీపీ పరోక్ష మిత్రుడు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కాసాని ధృవీకరించే కామెంట్లు చేశారు! ఇదే సమయలో బీజేపీకి జనసేన ప్రత్యక్ష మిత్రుడిగానే ప్రస్తుతానికి ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

ఇదే సమయంలో బీఆరెస్స్ - ఎంఐఎంల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అంటుంటారు రాజకీయ పరిశీలకులు. ఈ క్రమంలో రెగ్యులర్ గా పోటీచేసే ఏడు స్థానాల్లో కాకుండా ఈసారి తొమ్మిది స్థానాల్లో పోటీచేయాలని ఎంఐఎం తీసుకున్న నిర్ణయం కూడా ఆ స్నేహంలో భాగమే అని అంటున్నారు. ఇందులో ప్రధానంగా జూబ్లీహిల్స్ లో పోటీచేయాలని ఎంఐఎం నిర్ణయించుకోవడం వెనుక కేసీఆర్ సరికొత్త వ్యూహం ఉందని.. లక్ష్యం అజారుద్ధీన్ అని అంటున్నారు పరిశీలకులు.

అవును... తన పరిధిని విస్తరించాలని ప్రతిపాదనలు, ఒత్తిడి వచ్చినప్పటికీ.. ఎంఐఎం తన పోటీలను పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఒకసమయంలో... అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్రవ్యాప్తంగా 20 నియోజకవర్గాలలో, ముఖ్యంగా ముస్లిం జనాభా గణనీయంగా ఉన్న ప్రాంతాలలో పోటీ చేయాలని పార్టీ ఉద్దేశాన్ని ప్రకటించారు. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో ఆ ప్లాన్ పక్కనపెట్టారని తెలుస్తుంది!

ఈ నేపథ్యంలో తాజాగా పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోనూ పోటీ చేయనున్నట్టు ఎంఐఎం వెల్లడించింది. అయితే తాజాగా ఈసారి మరో రెండు నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీకి తన అభ్యర్థులను నిలబెడుతుండటం వెనుక బీఆరెస్స్ తో స్నేహపూర్వక పోటీకి సిద్ధపడటం ప్రధాన కారణం అని అంటున్నారు పరిశీలకులు!

ఒకపక్క పాతబస్తీలో, బీఆరెస్స్ - ఎంఐఎం అభ్యర్థుల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని.. అల ఫిక్సయిన తర్వాతే బీఆరెస్స్ అభ్యర్తులు పోటీలో పాల్గొంటారని అంటుంటారు! ఇదే సమయంలో సిటీలోని రెండు కొత్త స్థానాల్లోనూ ఎంఐఎం నుంచి బీఆరెస్స్ అదే ఆశిస్తుందని చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా జూబ్లీహిల్స్ లో అనేది గట్టిగా వినిపిస్తున్న మాట.

జూబ్లీహిల్స్‌ లో మాజీ భారత క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్‌ ను కాంగ్రెస్ తన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. ఈ విషయంలో తనకు అన్యాయం చేశారంటూ పీజేఆర్ కుమారుడు విష్ణు, తాజాగా బీఆరెస్స్ లో చేరిపోయారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సమయంలో ఎంఐఎం జూబ్లీహిల్స్ లో తమ అభ్యర్థిని పోటీలో ఉంచుతుంది.

ఫలితంగా ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో తగినంత సంఖ్యలో ఆ ఓట్లను విభజించగలదని, ఫలితంగా బీఆరెస్స్ అభ్యర్థికి నేరుగా సహాయపడుతుందని, అదే కేసీఆర్ స్కెచ్ అని అంటున్నారు. ఇదే సమయంలో... ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ వైపు పోకుండా ఎంఐఎం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

దీంతో... ఎంఐఎం ఈ ఎన్నికల్లో రెండు కొత్త నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నప్పటికీ, దాని వ్యూహాత్మక విధానం బీఆరెస్స్ ప్రయోజనాలను కాపాడటమే అని వినిపిస్తున్న కామెంట్లకు క్లారిటీ ఎన్నికల సమయంలో తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. మరి జూబ్లీహీల్స్ నియోజకవర్గం విషయంలో బీఅరెస్స్ స్కెచ్, ఎంఐఎం పోటీ విషయాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయనేది వేచి చూడాలి!