పవన్ ను భార్యలు అందుకే వదిలేశారన్న ఆర్కే రోజా నిప్పులు
గడిచిన కొద్ది రోజులుగా వారాహి విజయయాత్ర పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న పర్యటనలు ఏపీలో రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి.
By: Tupaki Desk | 16 July 2023 4:37 AM GMTగడిచిన కొద్ది రోజులుగా వారాహి విజయయాత్ర పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న పర్యటనలు ఏపీలో రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. తన వ్యాఖ్యలతో ఏపీ అధికార పక్షంపై విరుచుకుపడుతున్న జనసేనానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలుకొని ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా నిప్పులు చెరుగుతున్నారు. ఎవరి స్థాయిలో వారు.. పవన్ పై దునుమానుడుతున్న తీరు.. అందుకు సమయానుకూలంగా పవన్ ఇస్తున్న జవాబులతో ఏపీ రాజకీయాల్లో వైసీపీ వర్సెస్ పవన్ అన్నట్లుగా మారింది.
ఇదిలా ఉంటే.. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ పై ఒంటికాలిపై విరుచుకుపడే మంత్రి ఆర్కే రోజా తాజాగా మరోసారి జనసేనానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలానే చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ పని చేస్తున్నట్లు ఆరోపించిన ఆమె.. మరింత వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లారు. పవన్ కల్యాణ్ భార్యలు ఎందుకు విడిచి పెట్టి వెళ్లిపోయారో తెలుసా? అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
పవన్ ఎవరి మాట వినడని.. అందుకే అతడి భార్యలు అతన్ని వదిలేసి వెళ్లిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కు చంద్రబాబు పూనిన చంద్రముఖి ఆవహించిందన్న ఆమె.. చంద్రబాబు హయాంలో ఏపీ ప్రజలకు జరిగిన మోసాలపై పవన్ స్పందించలేదన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నరోజా.. కేంద్రం అనేక రకాలుగా లబ్థిదారుల డేటా తీసుకుంటే అక్రమ రవాణా చేస్తున్నారని ప్రధాని మోడీని నిలదీయగలవా? అంటూ ప్రశ్నించిన రోజా వ్యాఖ్యలకు పవన్ ఏ రీతిలో రియాక్టు అవుతారు? అన్నదిప్పుదు ప్రశ్నగా మారింది.