Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఫొటో పెట్టుకుంటే ఎక్క‌డైనా గెలుపే: మంత్రి కామెంట్స్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Dec 2023 6:42 PM GMT
జ‌గ‌న్ ఫొటో పెట్టుకుంటే ఎక్క‌డైనా గెలుపే:  మంత్రి కామెంట్స్‌
X

ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించుకునేందుకు మార్పులు, చేర్పులు ఇప్ప‌టికే చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో సిట్టింగుల‌కు కొంద‌రికి టికెట్లు ఉండ‌వ‌ని కూడా ప్ర‌క‌టించారు. మ‌రికొంద‌రిని నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు చేశారు. అయితే.. దీనిపై మెజారిటీ నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఉమ్మ‌డి గుంటూరు జిల్లా వేమూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, ఎస్సీ నాయ‌కుడు, మంత్రి మేరుగ నాగార్జున కూడా జ‌గ‌న్ మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటామ‌ని చెప్పుకొచ్చారు.

జగనన్న మాటే మాది...ఆయన ఎక్కడ నుంచి పోటీ చేయ‌మంటే అక్క‌డే పోటీ చేస్తామ‌ని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానిం చారు. జ‌గ‌న్ ఫొటో పెట్టుకుంటే ఎక్క‌డైనా గెలిచే స‌త్తా వ‌స్తుంద‌ని అన్నారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ‘‘ రాజ‌కీ య‌, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఊరికే వచ్చాడా.. వైసీపీకి పని చేసి డబ్బులు తీసుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ కన్నా ఆరుగురు ప్రశాంత్ కిషోర్లు జగన్ గుండెల్లో ఉన్నారు. రాజకీయం ఎలా చేయాలో మా నాయ కుడికి తెలుసు. ఎంత మంది ప్రశాంత్ కిషోర్లు అమ్ముడు పోయినా వైసీపీకి ఏమీకాదు`` అని వ్యాఖ్యానిం చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌ని.. ఫ‌లితాలు చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయ‌ని మేరుగ అన్నారు.

ఇక‌, నియోజక వర్గాల్లో అభ్యర్థుల మార్పు గురించి మాట్లాడుతూ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో అభ్య‌ర్థుల మార్పు, నియోజ‌క‌వ‌ర్గాల నుంచి బ‌దిలీలు అనే విష‌యాలు రాజ‌కీయంగా ప్రతి పార్టీలో జరుగుతుందన్నారు. టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ బీసీలు బలంగా ఉన్న నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని చూసి పాదయాత్ర ఎలా చేయాలో నేర్చుకోవాలని విమ‌ర్శించారు. పాదయాత్రలో లోకేష్ రాసిన ఎర్రపుస్తకాన్ని ఏం చేస్తాడని.. మంత్రి మేరుగ ఎద్దేవా చేశారు. కాగా, త‌న‌కు నియోజ‌క‌వ‌ర్గం మార్చినంత మాత్రాన ఎలాంటి ఇబ్బంది లేద‌ని.. జ‌గ‌న్ ఫొటో పెట్టుకుని ఎక్క‌డైనా గెలిచేస్తాన‌ని మేరుగ వ్యాఖ్యానించారు.