Begin typing your search above and press return to search.

హరీష్...కేటీయార్ ల మధ్యలో ఏమవుతోంది...?

బీయారెస్ లో ఇద్దరు దిగ్గజ నాయకుల మధ్య గ్యాప్ ఉందా అన్న చర్చకు తెర లేస్తోంది.

By:  Tupaki Desk   |   2 Sep 2023 11:14 AM GMT
హరీష్...కేటీయార్ ల మధ్యలో ఏమవుతోంది...?
X

బీయారెస్ లో ఇద్దరు దిగ్గజ నాయకుల మధ్య గ్యాప్ ఉందా అన్న చర్చకు తెర లేస్తోంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు ఒకరు కేసీయార్ కుమారుడు మంత్రి కేటీయార్ అయితే మరొకరు కేసీయార్ మేనల్లుడు హరీష్ రావు. ఈ ఇద్దరు మధ్య ఏదో జరుగుతోంది అన్న అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా సీట్ల విషయంలోనే హరీష్ కేటీయార్ ల మధ్య ఏదో జరుగుతోంది అని బీయారెస్ వర్గాలు అంటున్నాయి.

కొన్ని కీలకమైన సీట్లలో ఇద్దరు నేతల మధ్యన అభిప్రాయ భేదాలు వచ్చాయని అంటున్నారు. నర్సాపూర్ లో కేటీయార్ సునీతా లక్ష్మారెడ్డిని సపోర్ట్ చేస్తూ ఉంటే హరీష్ రావు కేసీయార్ మాత్రం ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే మైనంపల్లి హనుమంతరావు కేటీయార్ కి బాగా సన్నిహితంగా ఉంటారు అని అంటారు. ఆయన ఏకంగా హరీష్ రావునే టార్గెట్ చేయడం ఇటీవల కాలంలో అంతా చూశారు. ఎవరూ అనలేని విధంగా ఆయన మాట్లాడారు అని అంటున్నారు. దీంతో ఈ వివాదం కూడా రాజకీయ రచ్చ రేపింది. ఇలా మైనంపల్లి మాట్లాడం వెనక ఏ వ్యూహాలు ఉన్నాయని కూడా బీయారెస్ లో చర్చ సాగుతోంది.

ఇంకో ఐపు చూస్తే ఉప్పల్ సీటు విషయంలో కూడా హరీష్ రావు కేటీయార్ ల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయని అంటున్నారు. అవి ఒక పట్టాన తేలకపోవడానికి కారణ ఈ ఇద్దరు నేతల వైఖరి అంటున్నారు. అదే విధంగా నిజమాబాద్ జిల్లాలో చాలా సీట్ల విషయంలో ఈ ఇద్దరు మధ్యన విభేదాలు ఉన్నాయని అంటున్నారు.

అయితే ఇలా హరీష్ రావు, కేటీయార్ ఇద్దరూ కొన్ని విషయాలలో గ్యాప్ పెంచుకుని డిఫరెన్సెస్ తో వ్యవహరిస్తూంటే పెద్దాయన కేసీయార్ మాత్రం ఇద్దరు నేతలను కూర్చోబెట్టుకుని అన్ని విషయాలలో సర్దుబాటు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బీయారెస్ లో కేసీయార్ తరువాత తరం చేతికి పగ్గాలు వస్తాయి అని ఒక రకమైన ప్రచారం ఉంది.

దాంతో 2023 డిసెంబర్ లో జరిగే ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ఈసారి బీయారెస్ గెలిస్తే కేసీయార్ ఎక్కువ కాలం సీఎం గా ఉండరని అంటున్నారు. ఆయన తన వారసుడిని డిక్లేర్ చేసి సీఎం గా ప్రకటిస్తారు అని అంటున్నారు. దాంతో కేటీయార్ కి సీఎం చాన్సెస్ ఉంటాయని అంటున్న నేపధ్యంలో పార్టీ మీద గట్టి పట్టు ఉన్న హరీష్ రావు కూడా ఇపుడు అత్యంత కీలకం అవుతారు అని అంటున్నారు. దాంతో ఈ ఇద్దరు నేతలకు ఈ ఎన్నికలు ప్రాణప్రదంగా మారాహ్యి. అలాగే ప్రతీ సీటు విషయంలో ఎవరి విధేయులను వారు ప్రోత్సహిస్తూ వస్తున్నారు అని టాక్ బీయారెస్ లో నడుస్తోంది.

అయితే రాజకీయ గండర గండడు అయిన కేసీయార్ ఉండడం వల్ల అన్నీ సర్దుబాటు చేస్తున్నారు కానీ హ్యాట్రిక్ విజయం సాధించి బీయారెస్ మరోమారు అధికారంలోకి వస్తే మాత్రం ఏమి జరుగుతుంది ఈ గ్యాప్ అన్నది ఇద్దరు నేతల మధ్య పెరుగుతుందా లేక ఏమవుతుంది అన్నదే ఇపుడు బీయారెస్ లో హాట్ హాట్ గా సాగుతున్న చర్చ అంటున్నారు.